English   

సైరా వార్ మధ్యలో జోకర్...ఏమయ్యేనో...

Sye Raa Narasimha Reddy War.jpg
2019-09-26 09:35:25

దసరా సందర్భంగా అక్టోబర్ 2 వ తేదీన సైరా సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  ఈ సినిమా నాలుగు బాషలలో ఏకకాలంలో రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ సంచనలనాలు సృష్టిస్తుందనే మాటలో ఎటువంటి సందేహం అవసరం లేదు. కానీ ఈ సినిమాకి అదే రేంజ్ లో ఆడుతుందనుకున్న బాలీవుడ్ లో నే ఏ స్థాయిలో విజయం సాధిస్తుంది అన్నది సందేహం. ఎందుకంటే అయితే అన్ని చిత్ర పరిశ్రమల నుండి మెగాస్టార్ సినిమాకి పోటీగా ఎవరు తమ సినిమా విడుదల చెయ్యాలనుకోలేదు.

ఒక్కబాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్ తప్ప. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మాత్రం అక్టోబర్ 2న తమ సినిమా వార్ విడుదల చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్’ హిందీతో పాటు తెలుగులో కూడా అక్టోబర్ 2నే రానుంది. కానీ ‘సైరా’ దెబ్బకి ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతుందని మొదట అనుకున్నప్పటికీ వార్ సినిమా అనుకున్న డేట్ కే మెగాస్టార్ సినిమాకి పోటీగా విడుదల చేసేలా ప్లాన్ చేశారు. సైరాలో అమితాబ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో సైరా పై బాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాతో పాటు అలాగే హాలీవుడ్ భారీ చిత్రం ‘జోకర్’ కూడా అదే రోజున రానుంది.

హిందీలో మంచి క్రేజ్ ఉన్న ఈ సినిమాని మొదట 4వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నావాళ్ళు కూడా ముందుకొచ్చి 2వ తేదీనే రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలకు భారీ సంఖ్యలో థియేటర్ల కేటాయింపు ఉంటుంది కాబట్టి ‘సైరా’కి పోటీ తప్పదు. ఆ పోటీని తట్టుకోవాలంటే బాలీవుడ్ లో సైరాకి గట్టిగా ప్రమోషన్ చేయాల్సిన రీతిలో చేయాల్సి ఉన్నది.  గతంలో రాజమౌళి సినిమా మొదలైనప్పటి నుంచి బాలీవుడ్ లో ప్రమోషన్ చేస్తూ వచ్చారు.  బాలీవుడ్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టడంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఆ ఊపులో సాహో కూడా అక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టింది.  బాహుబలితో బాలీవుడ్లో ప్రభాస్ మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి అది ప్రభాస్ కు కల్సి వచ్చి సాహో మైలేజ్ కి ఉపయోగపడింది.  సైరా అలా కాదు కేలవళం అమితాబ్ పేరుతో అది కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాకపోవడంతో గట్టిగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

More Related Stories