English   

హుషారుగా ఓకే చెప్పాడు...ఎన్నారై క్యారెక్టర్ కోసమా 

vijay devarakonda
2019-09-26 12:44:36

టాలీవుడ్ స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరో కుర్ర దర్శకుడితో వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇప్పటికే రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విజయ్ పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇక పూరీతో కాక  'హుషారు' దర్శకుడు శ్రీహర్ష కోనుగంటికి విజయ్ దేవరకొండ ఓకే చెప్పాడనే వార్త కూడా హల్చల్ చేస్తోంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన 'హుషారు' యూత్ కి బాగా కనెక్ట్ అయి మంచి వసూళ్లను రాబట్టింది. 

దర్శకుడిగా శ్రీహర్షకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇటీవల ఆయన విజయ్ దేవరకొండకి ఒక కథ వినిపించగా, తనకి బాగా నచ్చేసిందనీ, చేసేద్దామని విజయ్ దేవరకొండ మాట ఇచ్చేశాడట. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు. ఈ సినిమా కధ కూడా లాక్ చేసినట్టుగా చెబుతున్నారు. ఫారెన్ లో పెరిగిన ఓ ఎన్నారై యువకుడు మారుమూల పల్లెటూరు వచ్చి ఉండాల్సి వస్తుందట. ఆ క్రమంలో హీరో ఎదురుకునే సమస్యలనే మెయిన్ ఫోకస్ గా పెట్టి సినిమా అనుకుంటున్నారని చెబుతున్నారు. నిజానికి ఇదే లైన్ తో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. మరి ఈ సినిమాలో విజయ్ తన మార్క్ చూపిస్తాడో లేదో చూడాలి. 

More Related Stories