English   

కమెడియన్ వేణు మాధవ్ అక్కడే దెబ్బతిన్నాడా.. 

Venu Madhav
2019-09-26 12:53:01

కమెడియన్ వేణు మాధవ్ ఒకప్పుడు స్టార్. పదేళ్ల కింద ఆయన లేని తెలుగు సినిమాను ఊహించుకోవడమే కష్టంగా ఉండేది. హీరో ఎవరైనా కూడా కామెడీ మాత్రం ఆయనదే అన్నట్లు ఉండేది. అయితే ఆ తర్వాత ఉన్నట్లుండి ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు వేణు. ఒక్క సినిమా కూడా లేకుండా మారిపోయాడు. దానికి ఓ కారణం అనారోగ్యం అయితే.. మరో కారణం సొంతంగా సినిమాలు చేసి ఉన్న ఇమేజ్ పోగొట్టుకోవడం. అవును.. అప్పట్లో ఆయన నిర్మాతగా మారి రెండు సినిమాలు చేసాడు. ఒకటి భూ కైలాస్.. రెండు ప్రేమాభిషేకం. రెండింట్లోనూ ఈయనే హీరో. కానీ ఈ రెండు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమాలతో డబ్బుతో పాటు పేరు కూడా పోగొట్టుకున్నాడు వేణు మాధవ్. అప్పట్లో ఆయనకు ఉన్న ఇమేజ్ ఈ సినిమాల కారణంగా పోవడమే కాకుండా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. నిర్మాతగా ఒక్క హిట్ అయినా కొడదాం అని కలలు కన్న వేణుకు చివరికి ఆ కోరిక తీరకుండానే కన్నుమూయడం విషాదం. 

More Related Stories