English   

సైరాకు సెన్సార్ సమస్య.. ఎంట్రీ ఇచ్చిన తెలంగాణ హై కోర్ట్..

sye raa narasimha reddy
2019-09-26 15:56:29

సైరా నరసింహా రెడ్డి సినిమాకు అనుకోని చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుందని ప్రమోషన్స్ చేసుకుంటున్న తరుణంలో తెలంగాణ హై కోర్ట్ ఈ చిత్ర విడుదలను ఆపాలంటూ ఉయ్యాలవాడ వారసులు వేసిన పిటిషన్ ను తీసుకుంది. దీనిపై హైకోర్టు లో విచారణ చేస్తుంది. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా విడుదల చేయలేదని కోర్ట్ కు సెన్సార్ బోర్డు తెలిపింది. ఇక ఈ విషయంలో నిర్మాత రామ్ చరణ్ కూడా తన జాగ్రత్తలు తాను తీసుకుంటున్నాడు. వారసులు వస్తారని ముందే తెలిసి.. ఇది బయోపిక్ కాదని కోర్టుకు తెలిపాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇది కేవలం కల్పిథ కథ అంటున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ విషయంపై కోర్టు తన నిర్ణయాన్ని సెప్టెంబర్ 30న తెలపనుంది. అప్పటి వరకు సైరా నిర్మాతలకు ఈ టెన్షన్ తప్పదు. అదే సమయంలో సెప్టెంబర్ 30న తమ నిర్ణయం చెపుతామని కోర్ట్ కు సెన్సార్ బోర్డు తెలిపారు. హై కోర్ట్ కూడా అప్పటి వరకు కేస్ ను వాయిదా వేసింది. మరి ఈ కేస్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

More Related Stories