English   

సైరా సెన్సార్ రివ్యూ.. చిరంజీవి చరిత్ర సృష్టించడం ఖాయం..

Sye Raa Censor talk.jpg
2019-09-26 19:35:22

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. వారం రోజుల ముందే ఈ చిత్రం అన్ని సిద్ధం చేసుకుంది. దీనికి ఒక్క కట్టు కూడా లేకుండా యు బై ఎ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. అది కూడా సినిమాలో యుద్ధాలున్నాయి కాబట్టి రక్తపు మరకలు కనిపిస్తాయి. కాబట్టి యూకు తోడుగా ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. అంతేకానీ సినిమాలో ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు మాత్రం లేవని చెబుతున్నారు సెన్సార్ సభ్యులు. దానికి తోడు ఈ సినిమా చూసిన తర్వాత ఒక్కసారిగా అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారని.. ఇలాంటి సినిమాలు తెలుగు పరిశ్రమకు అందిస్తున్నందుకు చిరంజీవికి వారు మనసారా కృతజ్ఞతలు చెప్పారని తెలుస్తోంది. 

దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను అద్భుతంగా తెరకెక్కించాడని.. ఆయనపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు సెన్సార్ సభ్యులు. కచ్చితంగా రేపు సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు కూడా ఇదే ఫీల్ అవుతారని.. 2 గంటల 50 నిముషాల నిడివి ఉన్న కూడా ఎక్కడా సినిమా బోర్ కొట్టకుండా ఉంటుందని తెలుస్తోంది. ఉయ్యాలవాడ జీవిత చరిత్రను ఎక్కడ పక్కదారి పట్టించకుండా ఆయన జీవితంలో జరిగిన కీలకమైన ఘట్టాలను ఒక కథగా మలిచి దాన్ని సినిమాగా తెరకెక్కించారని చెబుతున్నారు సెన్సార్ సభ్యులు. బయోపిక్ అయినా కూడా కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా చిరంజీవి ఫ్యాన్స్ కు నచ్చే విధంగా సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని వార్తలు వినిపిస్తున్నాయి. 

సెకండ్ హాఫ్ సినిమాకు ప్రాణంగా నిలబడుతుందని.. క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా సైరా నరసింహారెడ్డి సినిమాతో చిరంజీవి మరోసారి చరిత్ర తిరగరాస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. 250 కోట్లతో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

More Related Stories