పవన్ కళ్యాణ్‌కు అనారోగ్యం.. కంగారు పడుతున్న అభిమానులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. కొన్ని రోజులుగా ఆయన సినిమాలు కాకుండా పాలిటిక్స్ తోనే బిజీగా ఉన్నాడు. సినిమాలు చేస్తున్నపుడు ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టిన పవన్ ఇప్పుడు మాత్రం అలా చేయడం లేదు. అందుకే మాటిమాటికి ఈయన అనారోగ్యం పాలవుతున్నాడు. ఇప్పుడు కూడా విజయవాడలో 'మీడియా' సమావేశం ఏర్పాటు చేసింది. అందులో పాల్గొనాల్సిందిగా పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు జన సైనికులు. కానీ దీనికి ఆయన రావడం లేదని సవినయంగా విన్నవించుకున్నాడు. దానికి కారణం కూడా చెబుతూ ఓ లేఖ కూడా రాసాడు పవర్ స్టార్.
మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తోన్న పోరాటానికి జనసేన తరుపున.. నా మద్దతు తెలియజేస్తున్నాని చెప్పాడు పవన్. గతంలో గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ సమయంలో.. వెన్నుపూసకు తీవ్ర గాయమైంది. అప్పట్నుంచి ఆయన ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఇప్పుడు పట్టించుకోకపోవడంతో ఇంకా ఎక్కువైపోయింది. రాజకీయాల్లో బిజీ కావడంతో పవన్ ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఆ మధ్య ఓ సారి విదేశాలకు వెళ్లొచ్చినా కూడా పెద్దగా ఫలితం రాలేదు. దాంతో ఇప్పుడు వెన్నునొప్పి మళ్ళీ తిరగబెట్టింది. దాంతో ఆయన ఎక్కడా కనిపించడం లేదు.. కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకోవాలని ఫిక్సైపోయాడు. మొన్న సైరా ఈవెంట్ లో కూడా ఇబ్బందిగానే కనిపించాడు పవన్ కల్యాణ్. ప్రస్తుతం వైద్యుల సంరక్షణలోనే ఉన్నాడు పవన్ కల్యాణ్. ఈయనకు త్వరగా నయం కావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.