English   

గద్దలకొండ గణేష్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. వరుణ్ తేజ్‌కు వర్షం దెబ్బ.. 

Gaddalakonda Ganesh
2019-09-27 12:30:35

వివాదమో.. విషాదమో తెలియదు కానీ 'వాల్మీకీ' సినిమా మాత్రం టైటిల్‌ మార్చుకుని వచ్చిన తర్వాత రచ్చ చేస్తుంది. ముఖ్యంగా ముందు నుంచి కాంట్రవర్సీల్లో ఉండటం.. విడుదలకు ముందు అంచనాలు ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ తీసుకొచ్చాయి. తొలి 3 రోజుల్లోనే ఈ చిత్రం 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. యావరేజ్ టాక్ వచ్చినా.. ఒరిజినల్ ను చెడగొట్టాడనే టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల విషయంలో మాత్రం సంచలనాలు రేపాడు గద్దలకొండ గణేష్. హరీష్ శంకర్ టేకింగ్ దీనికి ప్లస్ కాగా.. వరుణ్ తేజ్ మేకోవర్ కూడా అదిరిపోయింది. అయితే వీకెండ్ వరకు దుమ్ము దులిపేసిన గణేష్.. నాలుగో రోజు నుంచి వర్షానికి బలైపోయాడు. వసూళ్లు అన్ని చోట్ల నుంచి బాగానే వస్తున్నా కూడా వరణుడు కరుణించకపోవడంతో చాలా చోట్ల కలెక్షన్లకు భారీగండి పడింది. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో కూడా ఎడతెరిపి లేని వర్షాలు వరుణ్ తేజ్ సినిమాకు దెబ్బ కొట్టాయి. వారం రోజుల్లో ఈ చిత్రం కేవలం 19.50 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. దీనికి ఉన్న ఇమేజ్.. బయట ఉన్న టాక్ కు తొలివారంలోనే 23 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేసారు. కానీ వరుణుడి దెబ్బ పడటంతో వరుణ్ తేజ్ కు తిప్పలు తప్పలేదు. అయితే రెండో వారం కూడా సినిమాలేవీ లేకపోవడం వాల్మీకికి కలిసొచ్చే అంశం. మరి ఈ అవకాశాన్ని ఎంతవరకు వరుణ్ సినిమా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. 

More Related Stories