English   

బాలీవుడ్‌లో కలెక్షన్లు వద్దా చిరంజీవి గారూ..

Sye Raa Narasimha
2019-09-27 15:49:29

సైరా నరసింహా రెడ్డి సినిమాను కేవలం తెలుగులోనే కాదు.. ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ కథకు అంత పవర్ ఉందంటున్నాడు ఆయన. పైగా 250 కోట్లు పెట్టడంతో ప్రతీ భాషలోనూ ఈ సినిమా సంచలనం రేపుతుందని నమ్ముతున్నాడు చరణ్. అయితే తెలుగులో సైరాకు ప్రత్యేకంగా ప్రమోషన్ అవసరం లేదు.. ఇక్కడ మెగాస్టార్ ఉన్నాడు కాబట్టి సరిపోతుంది. కానీ ఇతర భాషల్లో అలా కాదు. ముఖ్యంగా హిందీలో ప్రమోషన్ లేకపోతే స్టార్ హీరోలనే పట్టించుకోరు. అలాంటిది మెగాస్టార్ అయినా కూడా వాళ్లకు మాత్రం చిరంజీవి మామూలు హీరో. హిందీలో సినిమా హిట్ కావాలంటే పది రోజుల ముందు నుంచే ప్రమోషన్ చేయాలి. సాహో సినిమాకు ప్రభాస్ చేసిందిదే. తెలుగులో ఎలా ఉన్నా కూడా హిందీలో మాత్రం 20 రోజులు మకాం వేసాడు. అక్కడే ఉండి సాహో కోసం తిరిగాడు. రియాలిటీ షోలు.. బిగ్ బాస్.. నచ్ బలియే.. కపిల్ శర్మ షో.. ఇలా ఏ ఒక్కటి వదలకుండా అన్నీ తిరిగాడు ప్రభాస్. దాని ఫలితమే సాహో తెలుగులో ఫ్లాప్ అయినా కూడా హిందీలో 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. కానీ సైరా విషయంలో ఆ ప్రమోషన్ ఏదీ కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఒక్క టీజర్ లాంఛ్ తప్పిస్తే ముంబైలో సైరా కోసం చేసిందేమీ లేదు. అమితాబ్ ఉన్నాడనే ధైర్యం కనిపిస్తున్నా కూడా ఎంతవరకు ఇది అక్కడ వర్కవుట్ అవుతుందనేది అనుమానమే. మరో నాలుగు రోజుల్లోనే విడుదల కానున్న సైరా.. బాలీవుడ్ లో ఎంతవరకు ప్రభావం చూపిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్కడ ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాను 40 కోట్లకు కొన్నాడు. 
 

More Related Stories