English   

సైరా క్లైమాక్స్‌లో స్టార్ హీరో.. మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. 

 Pawan Kalyan
2019-09-27 18:12:05

మరో 5 రోజుల్లో సైరా విడుదల కానుంది. ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అని ఇప్పట్నుంచే అంచనాలు వేసుకుంటున్నారు మెగాభిమానులు. పైగా చిరంజీవి హీరో కావడంతో వాళ్ల అంచనాలన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. అన్నింటికి మించి 250 కోట్ల సినిమా కావడంతో తెలుగు సినిమాలో మరో బాహుబలి అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాను అంతే స్థాయిలో సురేందర్ రెడ్డి కూడా తెరకెకక్కించాడు. ఇక ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటికి వచ్చింది. సైరా క్లైమాక్స్ లో చిరంజీవిని ఉరి తీస్తారని తెలుస్తుంది.. మెగాస్టార్ మరణించడాన్ని కూడా చూపించబోతున్నాడు సురేందర్ రెడ్డి. అయితే చిరు చనిపోతే అభిమానులు ఎలా జీర్ణించుకుంటారో తెలియక.. సురేందర్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసాడని తెలుస్తుంది. ఆయన ఉరి తర్వాత వెంటనే ఆలస్యం చేయకుండా పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ రానుందని.. ఆయనే తెరపై కనిపించి.. ఈ వాయిస్ చెప్తాడని తెలుస్తుంది. ఉయ్యాలవాడ దేశానికి చేసిన సేవ.. ఆయన నుంచి పొందిన ప్రేరణ.. స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన త్యాగాల గురించి రెండు నిమిషాల పాటు పవన్ కనిపించి చెప్తాడని ప్రచారం జరుగుతుంది. అలా పవన్ వాయిస్ ఓవర్ తోనే థియేటర్స్ నుంచి బయటికి రానున్నారు. ఉయ్యాలవాడ చరిత్రను వక్రీకరించకుండా ఉన్నదున్నట్లు చెప్పే ప్రయత్నమే చేస్తున్నాడు సురేందర్ రెడ్డి. మరి దీన్ని ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8000 థియేటర్స్ లో విడుదల కానుంది సైరా. 

More Related Stories