English   

రాయలసీమ లవ్ స్టోరీ రివ్యూ

Rayalaseema Love Story
2019-09-27 18:27:20

నూతన నటీనటులు వెంకట్ హీరోగా హ్రిశాలి మరియు పావనిలు హీరోయిన్లు గా రామ్ రణధీర్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ పంచలింగాల బ్రదర్స్ నిర్మించిన సినిమా రాయలసీమ లవ్ స్టొరీ. సినిమా విడుదలకు ముందు టైటిల్ పట్ల వివాదం చెలరేగింది. మనోభావాల బ్యాచ్ అడ్డంకులు సృష్టించినా అన్ని అడ్డంకులను అధిగమించి ఈరోజు విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే.

కథ :

రాయలసీమ ప్రాంతానికి చెందిన కృష్ణ ( వెంకట్ ) ఎస్ఐ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. ప్రేమ,అమ్మాయిలు అనేవి లేకపోతేనే మగాడు ప్రశాంతంగా ఉంటాడు అనుకుని వాటికి దూరంగా ఉంటాడు కృష్ణ. తన మిత్రుడు శృంగారం(నల్లవేణు)తో కలిసి ఒక ఇంట్లో అద్దెకు దిగుతాడు. అయితే కొన్నాళ్ళ పాటు ఇంటి కిరాయి కట్టకపోవడంతో ఓనర్ ఇల్లు ఖాళీ చేయిస్తాడు. అదే సమయంలో డాక్టర్ పల్లవి(పావని) తన ఇంట్లో కృష్ణ, శృంగారంలకు షెల్టర్ ఇస్తుంది. పల్లవి ఇంటి ఎదురుగా ఉండే రాధ(హృశాలి)ని చూసి లవ్ లో పడతాడు కృష్ణ. రాధ కూడా కృష్ణని ప్రేమిస్తుంది. అయితే అనూహ్యంగా రాధ వివాహం మరొకరితో నిర్ణయించబడుతుంది. దాంతో పద్మలాగే రాధ కూడా నన్ను మోసం చేసిందని కుమిలిపోతుంటాడు కృష్ణ. అసలు పద్మ ఎవరు ? కృష్ణ ప్రేమించింది ఎవరిని ? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం :

లవ్ స్టోరీస్ అంటే అందరూ  కనెక్ట్ అవుతారు. ఈ సినిమా కూడా అంతే కొన్ని సీన్స్ ఎమోషనల్ గా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయి. హీరో ఫ్లాష్ బాక్ ఎపిసోడ్, సెకండాఫ్ లోని కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. దర్శకుడు అందరికి తెలిసినదే అయినా అందరికి బాగా కనెక్ట్ అయ్యే లవ్ స్టొరీ లైన్ ను ఎంచుకున్నారు. కానీ ఎమోషన్స్ ను అంతే బాగా తెరకేక్కించడంలో తడబడ్డారు. అసలు హీరోకి ప్రేమ అమ్మాయిలు నచ్చరని ముందు చూపించి చాలా సిల్లీగా మళ్ళీ వేరే అమ్మాయితో ప్రేమలో పడిపోయినట్టు అనిపిస్తుంది.

నటీనటుల ప్రతిభ :

ఇక నటీనటుల విషయానికి వచ్చినట్టైతే హీరోగా చేసిన వెంకట్ సినిమా మొత్తం మంచి నటన కనబరిచారు. హీరోగా నటించిన వెంకట్ కు ఇది తొలి చిత్రమే అయినప్పటికీ ఎంతో అనుభవమున్న నటుడిలా అన్ని ఎమోషన్స్ పలికించాడు. ఎమోషనల్ సీన్స్ లో రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టాడు. హీరోయిన్ లుగా నటించిన పావని , హృశాలి తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. పావని నటనతో ఆకట్టుకుంటే హృశాలి రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. లిప్ లాక్ లతో వెంకట్ , హృశాలి యూత్ ని ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వి , మిర్చి మాధవి , నల్లవేణు , జబర్దస్త్ బ్యాచ్ కొమరం , గెటప్ శ్రీను , రాజమౌళి , నాగినీడు తదితరులు తమ పాత్రలలో మెప్పించారు. సాయి ఏలేందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.రాయల్ చిన్న మరియు నాగరాజులు అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి .

సాంకేతిక వర్గం :

పంచలింగాల బ్రదర్స్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. తక్కువ బడ్జెట్ లోనే చేసినప్పటికీ క్వాలిటీ పరంగా రాజీపడలేదు. ఇక దర్శకుడు రామ్ రణధీర్ విషయానికి వస్తే ..... అతడికి ఇది మొదటి సినిమానే అయినప్పటికీ యూత్ ని అలరించే అన్ని అంశాలతో రాయలసీమ లవ్ స్టొరీ చిత్రాన్ని రూపొందించాడు. యూత్ కి సందేశం ఇస్తూనే వాళ్లకు కావాల్సిన మసాలా ని అందించాడు. డైలాగ్స్ కూడా యూత్ కి విపరీతంగా నచ్చడం ఖాయం. కాస్త పరిధి దాటి డైలాగ్స్ ని రాసినప్పటికి అవి యువతిని మెచ్చేలా ఉన్నాయి. దర్శకుడిగా కొత్త అయినప్పటికీ తనకు కావాల్సిన నటనని నటీనటుల నుండి రాబట్టుకున్నాడు. 4 పాటలు యువతని విశేషంగా అలరించేలా ఉన్నాయి. నువ్వంటే   పిచ్చిపిచ్చి ....,  ముద్దు తొలి ముద్దు అనే పాటలు హైలెట్ గా నిలిచాయి. నేపథ్య సంగీతం కూడా అలరించేలా ఉంది. విజువల్స్ బాగున్నాయి. అయతే ఎడిటింగ్ పరంగా కొన్ని సన్నివేశాలు కట్ చేసి ఉంటే మరింత గ్రిప్పింగ్ గా ఉండేది.

ఓవరాల్ గా : రాయలసీమ లవ్ స్టొరీ యూత్ ని అలరించే సినిమా.

రేటింగ్ : 2/5

More Related Stories