English   

బాబోయ్ రానా ఏంటి ఇంత రాక్షసంగా ఉన్నాడు..

rana
2019-09-27 21:01:42

ఇప్పుడు హౌజ్ ఫుల్ 4 సినిమాలో రానాను చూసి అంతా ఇదే అనుకుంటున్నారు. సాధారణంగా హౌజ్ ఫుల్ సినిమా అంటే కామెడీ.. ఫుల్ కామెడీ.. కడుపులు చెక్కలైపోయేలా ఈ ఫ్రాంచైజీ ప్లాన్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఈ సారి కూడా ఇదే చేసారు. కాకపోతే కాస్త కొత్తగా ఉంటుందని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ పెట్టాడు నిర్మాత సాజిద్ నడియావాలా. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్, బాబీ డియోల్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సంచలనాలు రేపుతుంది. పూజా హెగ్డే, కృతి సనన్, కృతి కర్బంధా ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు.

ముందు ఈ పాత్ర కోసం నానా పటేకర్ ను తీసుకున్నారు. అయితే మీటూ ఆరోపణలు రావడంతో ఈయన్ని తీసి పక్కనబెట్టేసారు దర్శక నిర్మాతలు. ఆ తర్వాత సీన్ లోకి వచ్చాడు రానా. ఇక ఇప్పుడు విడుదలైన ట్రైలర్ లో రానాను చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అసలు ఈయన రానా అని చెబితే తప్ప గుర్తించలేనంతగా మారిపోయాడు దగ్గుబాటి వారసుడు. పూర్తిగా మేకోవర్ అయిపోయి ఔరా అనిపిస్తున్నాడు ఈయన. రాక్షసంగా మారిపోయి.. సీరియస్ విలన్ పాత్రలో మెప్పించడానికి రెడీ అయ్యాడు రానా. హౌజ్ ఫుల్ 4 సినిమాతో కచ్చితంగా బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటానంటున్నాడు ఈయన. గతంలో డిపార్ట్ మెంట్ తో పాటు మరో రెండు మూడు సినిమాలు చేసాడు ఈ హీరో.

More Related Stories