పవన్ హీరోయిన్ బాలీవుడ్ లో మ్యాగ్జిమమ్ ట్రై చేస్తుందిగా..

పవన్ కల్యాణ్ హీరోయిన్ అంటే ఎవరనుకోవాలి.. చాలా మంది ఉంటారు కదా అనుకుంటున్నారా..? అందులో కృతి కర్భందా కాస్త ప్రత్యేకం. తీన్ మార్ సినిమాలో నటించిన ఈ భామ.. పదేళ్లుగా తెలుగులో ట్రై చేసినా కూడా జాతకం మారలేదు. అందాల ఆరబోతకు సిద్ధంగా ఉన్నా.. అక్క పాత్రలకు సెటిలైపోయినా కృతికి అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. చివరికి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కూడా ఈ భామ జాతకం మార్చలేకపోయారు. ఇప్పుడు కృతి ముందున్న ఏకైక లక్ష్యం అందాల ఆరబోత. గ్లామర్ షో లో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు కృతికర్బందా. ఇప్పటికీ హీరోయిన్ గా వెలిగిపోదామనే ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ.
ఓ వైపు అక్క పాత్రలు చేస్తూనే మరో వైపు హీరోయిన్ రోల్స్ కోసం కూడా ప్రయత్నాలు ఆపడం లేదు కృతి కర్బందా. ఆ మధ్య ఓ హాట్ ఫోటోషూట్ తో తానింకా హీరోయిన్ మెటీరియల్ నే అంటూ దర్శకనిర్మాతలకు ఓ హింట్ వదిలేసింది కృతి. ఇప్పుడు హౌజ్ ఫుల్ 4లో కూడా అదే స్థాయిలో అందాలు ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్లో సరైన విజయాలు రాకపోయినా కూడా తనకు వచ్చిన అవకాశాల్లో మాత్రం సత్తా చూపిస్తూనే ఉంది ఈ భామ. ఇప్పటికీ అక్కడ అవకాశాల కోసం చూస్తూనే ఉంది కృతి. ఇప్పుడు కూడా ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఉల్లిపొర కంటే పలుచగా ఉండే దుస్తుల్లో కనిపిస్తుంది. ఇక మధ్యలో ఫోటోషూట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించింది ఈ బ్యూటీ. మరి ఈ అందాల ఆకృతిని చూసిన తర్వాతైనా ఎవరైనా ఆఫర్లు ఇస్తారో లేదో చూడాలి.