తమిళ్ లో రష్మిక గట్టి ప్లానే వేసిందే

ఛలో సినిమాతో టాలీవూడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ నారి రష్మిక మందన్నా. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి రెండవ చిత్రం గీతగోవిందంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది తెలుగులో సెటిల్ అయ్యింది. కానీ రష్మిక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇక్కడ ఫ్లాపులొచ్చినా.. ఛాన్సులు బాగానే వస్తున్నాయి. కానీ.. ఈ ఫ్లాపుల ఎఫెక్ట్ కోలీవుడ్‌పై పడింది. ఇక్కడ మహేశ్..బన్నీ వంటి స్టార్స్‌తో జత కడుతుంటే.. తమిళంలో పెద్ద హీరోలు ఈ అమ్మడిని పట్టించుకోవడం లేదు. కార్తీ మూవీ "సుల్తాన్''తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ విజయ్, అజిత్ సినిమాలపై ఆశలు పెటుకుంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ 64 చిత్రంలో కూడా రష్మిక నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితేఎందుకయినా మంచిది అనుకుందో ఏమో కానీ మరో స్టార్ హీరోతో కూడా నటించాలని ఉందని కర్చీఫ్ వేసుకునే ప్రయత్నం చేసింది ఈ భామ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమిళ్ స్టార్ హీరో అజిత్ సరసన తాను హీరోయిన్ గా చేయాలని, ఆయనతో స్క్రీన్ రొమాన్స్ చేయడానికి తానూ ఇష్టపడతానని రష్మిక చెప్పుకొచ్చింది. ఇక రష్మిక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉంది. రష్మిక కార్తీ సరసన నటించిన సుల్తాన్ ఈ ఏడాది చివర్లో విడుదలవుతుంది. ఆ సినిమా హిట్ అయితే అమ్మడి కోరిక తీరచ్చేమో ?