English   

నిత్య లావు పెరిగింది అందుకేనా ?

 Nithya Menen
2019-09-28 09:47:06

నటి నిత్యామీనన్ టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలో సన్నగా ఉన్న ఈ భామ ఉన్న కొద్దీ బొద్దుగా తయారయ్యింది. ఇక ఈ మధ్య కాలంలో అయితే బాగా లావైపోయింది. దీంతో ఆమె శరీరాకృతిపై సోషల్ మీడియాలో రకరకాల త్రోలింగ్స్ కూడా నడిచాయి. ఆ మాధ్య తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తే వాటిపై కూడా ట్రోలింగ్ చేశారు. చాన్నాళ్ళు ఓపిక పట్టిన నిత ఈ విషయాలపై స్పందించింది కూడా. ఆమె బాలీవుడ్ లో నటించిన 'మిషన్ మంగళ్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నిత్య ఎవరైనా లావుగా కనిపించారంటే.. తిని కూర్చోవడం వలన, బద్ధకం వలన లావైపోయుంటారని అనుకునేవారు చాలా మంది ఉన్నారని అది వారి అమాయకత్వమని చెప్పుకొచ్చింది. అలా తిని కూర్చోవడం వలన లావయ్యేవారు కూడా ఉంటారన్న ఆమె నటుల విషయంలో అది నిజం కాదని చెప్పుకొచ్చింది. హార్మోన్ల ప్రభావం వలనో ఇతర సమస్యల కారణంగానో శరీర బరువు పెరుగుతుందే తప్ప తిని కూర్చొని పొట్ట పెంచుకోవడం ఏ నటుడికీ ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది. అయితే అప్పుడు ఆమె మాటలను లైట్ తీసుకున్నా అసలు విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. నిత్యా తమిళ రాజకీయ సంచలనం జయలలిత బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఐరన్ లేడీ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్ జయలలిత పాత్ర చేస్తున్నారు. జయలలిత కొంచెం బొద్దుగా ఉంటారు కాబట్టి ఆమె లుక్ కోసమే నిత్య బరువు పెరిగినట్టు తెలుస్తుంది. గతంలో ది ఐరన్ లేడీ పేరుతో నిత్యా సన్నగా ఉన్న ఫోటోని పోస్టర్ గా వేసినా.. ఆ తర్వాత మరో పోస్టర్ రాలేదు. అయితే ఈ సినిమాలో నిత్యా ఎలా ఉండబోతుందో తాజాగా లీకైన ఒక ఫోటో తేల్చేసింది. అయితే ఆ విషయాన్నీ డైవెర్ట్ చేయడం కోసమే ఈ హార్మోన్స్ అదీ ఇదీ అని ఆమె చెప్పినట్టు భావిస్తున్నారు విశ్లేషకులు. నిజానికి నిత్య చెప్పినట్టు తిని కూర్చుంటేనే బరువు పెరుగుతారు అనుకోవడం పొరపాటే. నటులు తమ తమ పాత్రలలో ఇమిడిపోయేందుకు ఎంత దాకా అయినా వెళ్తారు అనేది నిత్య విషయంలో రుజువయ్యింది.

More Related Stories