English   

చిరంజీవి అప్పట్లోనే వార్నింగ్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్..

chiru
2019-09-28 20:12:42

చిరంజీవికి అమితాబ్ వార్నింగ్ ఇవ్వడం ఏంటి.. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా.. మెగాస్టార్ చిరంజీవికి చాలా ఏళ్ల నుంచి అమితాబ్ తెలుసు. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. హిందీ, తెలుగు మెగాస్టార్స్ అయినా కూడా అన్నదమ్ముల మాదిరే ఉంటారు. అలాంటి సందర్భంలో చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడానికి అమితాబ్ అస్సలు ఒప్పుకోలేదు. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం బిగ్ బి కి అస్సలు నచ్చలేదు. ఇదే విషయాన్ని ఆయన చెప్పాడు కూడా. కానీ చిరంజీవి ఈ విషయాన్ని పెడచెవిన పెట్టాడు. ఆ సమయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తాను రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ అని నిర్ణయించుకున్నాడు మెగాస్టార్. 2008లో ప్రజారాజ్యం పార్టీ మొదలు పెట్టాడు. కానీ జనాల నుంచి ఊహించిన స్పందన రాలేదు. ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 సీట్లు మాత్రమే సొంతం చేసుకొని దారుణమైన పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత రెండేళ్లపాటు పార్టీని ఎలాగోలా నడిపి 2011లో కాంగ్రెస్ లో విలీనం చేశాడు. అక్కడే కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించాడు మెగాస్టార్. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా రాజకీయాల్లో సినిమా వాళ్ళు రాణించడం అంతగా భావ్యం కాదని అని ముందే భావించాడు అమితాబ్. అందుకే చిరంజీవిని వారించాడు. కానీ ఈ విషయంలో మెగాస్టార్ మాత్రం ఎవరి మాట వినకుండా ముందడుగు వేసి తాను చేసిన తప్పు ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ కు కూడా చెబుతున్నాడు చిరంజీవి. ధన, కుల ప్రవాహాలు ఎక్కువగా ఉన్న రాజకీయాల్లో సినిమా వాళ్ళు వెళ్లినా పెద్దగా మార్పు ఉండదు అనేది చిరంజీవి అభిప్రాయం. అప్పుడు తాను వినలేదు కాబట్టే పదేళ్లపాటు కష్టాలు పడ్డాను అంటున్నాడు మెగాస్టార్. తాజాగా సైరా నరసింహారెడ్డి కోసం చిరంజీవి, అమితాబ్, ఫర్హాన్ అక్తర్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులోనే చాలా విషయాలు చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి. అక్టోబర్ 2న సైరా విడుదల కానుంది.

More Related Stories