English   

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో టైటిల్ చేంజ్..

ala
2019-09-28 21:33:13

నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయిపోయింది. తాజాగా విడుదలైన సామజవరగమన పాటకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తమన్ ఈ స్థాయి మ్యూజిక్ అయితే ఈ సినిమాకు ఇవ్వలేదు. వినీ వినగానే  సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోయింది ఈ ట్యూన్. ఇదిలా ఉంటే ఈ చిత్ర టైటిల్ ఇప్పుడు మార్చడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

టైటిల్ మార్చమంటే పూర్తిగా పేరు మార్చడం కాదు.. పేరులో ఉన్న అక్షరాలను మార్చడం. గతంలో విడుదల చేసిన టైటిల్ కు ఇప్పుడు విడుదల చేసిన టైటిల్ కు కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. కొత్తగా విడుదల చేసిన అల వైకుంఠపురములో ఇంగ్లీష్ టైటిల్ లో అదనంగా మరో రెండు అక్షరాలు వచ్చి చేరాయి. r, o రెండు కొత్త అక్షరాలను జత చేశారు చిత్రయూనిట్. ఇది న్యూమరాలజీ ప్రకారంగా కూడా ఉండొచ్చు అంటున్నారు విశ్లేషకులు. సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ బలంగా నమ్ముతారు. అందుకే ఈ టైటిల్ లో మరో రెండు అక్షరాలు అదనంగా చేరాయి. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. దసరాకు టీజర్ విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు దర్శకుడు త్రివిక్రమ్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డీజే సినిమా తర్వాత పూజా హెగ్డే మరోసారి ఇందులో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేస్తోంది. మొత్తానికి అదనంగా చేరిన ఈ రెండు అక్షరాలు అల్లు అర్జున్ జాతకాన్ని ఎలా మార్చబోతున్నాయో చూడాలి.

More Related Stories