English   

ఓవర్సీస్ లో అజ్ఞాతవాసిని దాటలేకపోయిన సైరా..

syeraa
2019-09-29 06:30:56

తెలుగు సినిమాలకు ఇప్పుడు కేవలం ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా భారీ డిమాండ్ ఉంది. అక్కడ మన సినిమాలు వస్తున్నాయి అంటే ఒక్కోసారి హాలీవుడ్ బాక్సాఫీస్ కూడా షేక్ అయిపోతుంది. ముఖ్యంగా బాహుబలి తర్వాత తెలుగు సినిమా రేంజ్ ప్రపంచ స్థాయిలో పెరిగిపోయింది. ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా మన సినిమాలను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు అక్కడ డిస్ట్రిబ్యూటర్లు. తాజాగా సైరా నరసింహారెడ్డి సినిమాను కూడా అక్టోబరు 1 సాయంత్రం భారీగా విడుదల చేస్తున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా 310 లొకేషన్లలో ఈ సినిమా విడుదలవుతుంది. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. భారతదేశ తొలి స్వతంత్ర సమరయోధుడి జీవిత కథ కావడంతో చిరంజీవి కూడా ఈ సినిమాపై నమ్మకంగా కనిపిస్తున్నాడు. 250 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై సైరా నరసింహారెడ్డి సినిమాను నిర్మించాడు. అయితే ఓవర్సీస్ లో ఎంత భారీగా విడుదలవుతున్నా కూడా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి రికార్డును మాత్రం దాటలేకపోయింది సైరా. ఆ సినిమా 2018 సంక్రాంతికి ఏకంగా 420 స్క్రీన్స్ లో విడుదలైంది. ఆ తర్వాత భరత్ అనే నేను 320కి పైగా స్క్రీన్లలో విడుదలైంది. ఇప్పుడు చిరంజీవి సైరా నరసింహారెడ్డి సైతం 310 లొకేషన్ లకు పైగానే విడుదల అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తుందని బలంగా నమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ విషయంలో అందరికంటే ముందున్నాడు ప్రభాస్. ఈయన నటించిన సాహో సినిమా అక్కడ 1100 స్క్రీన్స్ లో విడుదలై సంచలనం సృష్టించింది. ఇక రంగస్థలం 240.. అరవింద సమేత 255.. నా పేరు సూర్య 140.. వినయ విధేయ రామ 240.. మహర్షి 270 స్క్రీన్స్ లో విడుదలయ్యాయి. మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉండబోతుందో చూడాలి.

More Related Stories