English   

కోన వెంకట్ మీద చీటింగ్ కేసు

kona
2019-09-29 06:45:37

టాలీవుడ్ లో రచయితగా, దర్శకుడిగా కొన్ని సినిమాలకి పని చేసిన కోన వెంకట్ తాజాగా చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. కథ ఇస్తానని చెప్పి రూ.13.5 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కోన వెంకట్ పై జెమిని ఎఫ్ఎక్స్ సంస్థకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ప్రసాద్ అనే ఆయన ఫిర్యాదు చేశారు. డబ్బుతీసుకున్న తర్వాత సినిమా కథ ఇవ్వకపోగా, డబ్బు కూడా తిరిగివ్వనని ఎదురు తమనే బెదిరిస్తున్నారంటూ ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోన వెంకట్ పై 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జెమిని ఎఫ్‌ఎక్స్‌ సంస్థకు కొత్త సినిమా కోసం కథ రాసిస్తానని 2017 మే నెలలో కోన వెంకట్‌ రూ.13.5 లక్షలు అడ్వాన్స్‌ తీసుకున్నారట. అయితే రెండేళ్ళు అయినా కథ ఇవ్వకపోగా అప్పటి నుండి అందుబాటులో లేకుండా ఎక్కువ కాలం అమెరికాలో గడుపుతూ వస్తున్నారు. నిజానికి ఆయన అనుష్క ప్రధాన పాత్రలో సైలెన్స్ అనే సినిమా చేస్తున్నాడు. అనుష్క మూగ, బధిర యువతిగా నటిస్తున్న ఈ సినిమా సింహభాగం షూటింగ్ కూడా అమెరికాలోనే జరుగుతోంది.

More Related Stories