ఈరోజు ఎలిమినేషన్ ఎవరంటే ?

తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 పదో వారం ఎలిమినేషన్ కి సమయం దగ్గర పడింది. ప్రస్తుతం నామినేషన్స్ లో బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, శ్రీముఖి, రవికృష్ణలు ఉండగా వీరిలో ఒకరు ఈరోజు ఎలిమినేట్ కానున్నారు. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నదానిపై వార్త బయటకు వచ్చేసింది. అయితే ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్నది మరెవరో కాదు బిగ్ బాస్ హౌస్ లో అందరి చేత మంచి వాడు అని అనిపించుకున్న రవికృష్ణ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్నట్లు బయట వినిపిస్తున్న టాక్.
ఉన్న నలుగురిలో టీవీ యాక్టర్ రవికృష్ణ వీక్ అనే చెప్పాలి. మొదటి నుండి మంచోడు మంచోడు అనే ముద్ర వేసుకుంటూ నెట్టుకొచ్చిన రవి గేమ్ పరంగా చాలా వీక్ అదీ కాక మిగతా ముగ్గురు బలమైన వారు కావడంతో ఈ వారం రవికృష్ణనే ఇంటి నుండి బయటకి వెళతాడని నెటిజన్స్ వాదన. ఇక వోటింగ్ శాతం కూడా అదే నిజమనే చెబుతోంది. వరుణ్ సందేశ్, శ్రీముఖి వరుసగా 27.54 మరియు 27.09.. బాబా భాస్కర్... 24.52... రవి 20.85 శాతంతో వెనక పడి ఉన్నాడు. అయితే హౌస్ లో ఉండగా ఒక్కసారైనా కెప్టెన్ అవుదామని అనుకున్న రవి ఆశలు మాత్రం నెరవేరలేదు. తాజా కెప్టెన్సీ టాస్క్‌లో కెప్టెన్ అయ్యే అవకాశం లభించినా అది తృటిలో చేజారిపోయింది.
రవికృష్ణకి ఎలిమినేట్ అవుతాడనే భయం ఉండడంతో కెప్టెన్ టాస్క్‌లో కెప్టెన్ అయ్యేందుకు అందరినీ చాలా రిక్వెస్ట్ చేశాడు. కాని ఎవరు కరుణించకపోవడంతో కెప్టెన్ టాస్క్ పొందే అవకాశాన్ని మిస్ అయ్యాడు. ఇక రవి కృష్ణకే కాదు ఆయన బెస్ట్ ఫ్రెండ్ అలీ రాజాకి కూడా రవినే ఎలిమినేట్ అవుతాడనే ఆలోచన మనసులో ఉంది. అందుకే తోటి ఇంటి సభ్యులతో రవిని కెప్టెన్ చేద్దాం. రెండు రోజులైన ఇంటి కెప్టెన్‌గా ఉండి వెళతాడని చెప్పుకొచ్చాడు. మరి ఇది ఇంతవరకి నిజం అనేది ఈరోజు ఎపిసోడ్ లో తేలిపోనుంది.