English   

సరిలేరు నీకెవ్వరు నుండి మరో పిక్ లీక్

mb
2019-09-29 08:19:19

 సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇంతకు ముందు అసలు ఫ్లాప్ అంటే తెలియని డైరెక్టర్ కావడం ఇంతకు ముందు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవ్వడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు. విజయశాంతి ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెట్ దగ్గర షూటింగ్ జరుగుతుంది.  ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎ.ఎస్‌.ప్రకాష్‌ సారధ్యంలో కొండారెడ్డి బురుజును తలపించేలా ఓ సెట్‌ కూడా ఏర్పాటు చేశారు.

ఈ పిక్స్ ని ఈ మధ్య అనిల్ రావిపూడి కూడా షేర్ చేశారు.  ఖచ్చితంగా ఈ సెట్‌ కూడా సినిమాకి హైలైట్‌ అవుతుందని భావిస్తున్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌ సెట్‌లో కొన్ని కీలకఘట్టాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తాజాగా మహేష్ బాబు విజయశాంతిని, తాజేంద్ర ప్రసాద్ ని ట్రాక్టర్ మీద ఎక్కించుకుని ఉన్న పిక్ ఒకటి సెట్ నుండి లీకయింది. ఇది మహేష్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ నిరసన తెలిపే సీన్ అని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలీదు కానీ సినిమా రిలీజ్ అయ్యే దాకా వేచి చూడాల్సిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 

More Related Stories