English   

రంభ, రాశికి ఊహించని ఝలక్ ఇచ్చిన విజయవాడ కోర్టు..

rasi
2019-09-29 19:15:35

సీనియర్ హీరోయిన్ లకు ఊహించని షాక్ ఇచ్చింది కోర్టు. ఏ ప్రకటన పడితే ఆ ప్రకటనలో నటిస్తే కచ్చితంగా తిప్పలు తప్పవని ఇప్పుడు ఒకప్పటి హీరోయిన్లు రంభ‌, రాశీలను చూస్తుంటే అర్థమవుతుంది. సినిమాల్లో అవకాశాలు లేక ఇప్పుడు యాడ్ రంగం  వైపు వెళ్లి పోయారు ఈ ఇద్ద‌రూ. అక్కడే టీవీలో ప్రకటన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరు కలర్స్ లో వచ్చే ఒక వెయిట్ లాస్ ప్రోగ్రాంకు ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. వాడిన తర్వాత వాడక ముందు అంటూ వాళ్ళ పాత ఫోటోలు కొత్త ఫోటోలు పక్కపక్కనే వేసి ప్రచారం చేసుకుంటున్నారు ఆ సదరు సంస్థ. వీళ్లిద్దరు చెప్పారు కదా అని వినియోగదారులు కూడా బాగానే ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నారు.

అయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఒక వ్యక్తి విజయవాడ కోర్టును ఆశ్రయించాడు. ప్రజలను మోసం చేస్తున్నారని.. అబద్ధపు ప్రచారాలు చేసి ఆ ప్రకటనలో చూస్తున్నారని ఆయన ఆరోపించాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు ఆ వినియోగదారుడికి వెంటనే 75000 చెల్లించాలని ఆ సదరు సంస్థను ఆదేశించింది. దాంతో పాటు ఆ సంస్థకు చెల్లించిన 74,652ల మొత్తాన్ని 9 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.2 లక్షలను జరిమానాగా కట్టాలని పేర్కొంది. ఇక హీరోయిన్లను కూడా జాగ్రత్తగా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చింది కోర్టు. ఇలాంటి అబద్ధపు ప్రకటనల్లో పాల్గొని ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే భవిష్యత్తులో తిప్పలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది కోర్టు. అనుకోకుండా వచ్చిన ఈ పరిణామంతో ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు ఈ ఇద్దరు హీరోయిన్లు.

 

More Related Stories