English   

కార్తీ సినిమాకు మనోభావాల సెగ..ఆగిన సినిమా

karthi
2019-09-30 06:54:30

ఈ మధ్య కాలంలో మనోభావాలు దెబ్బ తినడం కామన్ గా మారింది. అయిన దానికి కానిదానికి మనోభావాలు దెబ్బ తినేస్తున్నాయి. ఒకప్పుడు హిందూ-ముస్లిం గొడవలపై సినిమా తీసిన మణిరత్నం వల్ల ముస్లిముల మనోభావాలు దెబ్బ తిని తీవ్ర విధ్వంశమే జరిగింది. ఏకంగా మణిరత్నం ఇంటిపైనే దాడికి దిగి అద్దాలు పగలగొట్టారు. అయితే ఆ వివాదానికి మతం అనే ఓ సహేతుక కారణం ఉంది. అలాగే భన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ సమయంలోనూ రాజ్ పుత్ ల మనోభావాలు దెబ్బ తిని నానా రచ్చ అయ్యింది.

ఇటీవలి కాలంలో పెద్దగా ఇబ్బంది లేకున్నా సినిమాలను, సినిమా షూటింగ్లను ఆపడం మామూలు అయిపొయింది. తాజాగా కార్తి- రష్మిక మందన్న జంటగా నటిస్తున్న 'సుల్తాన్' సినిమాకి కి కూడా ఇదే ఇబ్బంది ఎదురయ్యింది. ఈ సినిమా షూటింగ్ తాజాగా తమిళనాడు లోని దిండిగల్ ఫోర్ట్ లో జరిగింది. ఈ షూటింగ్ లో కార్తి రష్మిక ఇద్దరూ పాల్గొన్నారు. అయితే ఈ షూటింగును కొందరు ఆందోళనకారులు అడ్డుకున్నారట.  టిప్పు సుల్తాన్ మహారాజుపై సినిమా తీస్తే మేము ప్రతిఘటిస్తామని పైగా సుల్తాన్ పాలించిన ఈ కోటలో షూటింగ్ చేయడానికి మేము ఎంతమాత్రం ఒప్పుకోమని వారు షూటింగ్ కు ఇబ్బంది కలిగించడంతో కార్తి - రష్మిక షూటింగ్ పూర్తి చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చిందని అంటున్నారు.

ఈ విషయంపై అటు కార్తి కానీ ఇటు రష్మిక కానీ స్పందించలేదు కానీ సినిమా నిర్మాతలు మాత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమాలో ఏవి చూపించకూడదో చెప్పేందుకు సెన్సార్ బోర్డ్ ఉందని  ఆ విషయం పక్కన పెడితే సినిమాలో ఏం చూపించాలనే హక్కు ఫిలిం మేకర్స్ కు ఉంటుందని, అది మన దేశం క్రియేటర్లకు ఇచ్చిన స్వేచ్చ అని, ఆ స్వేచ్చకు భంగం కలిగించే సంస్థ లేక వ్యక్తుల చర్యలను మేము ఖండిస్తున్నాం. జాతీయ నాయకుల పేరిట.. కులం పేరిట.. మతం పేరిట గొప్ప నాయకులకు.. మన చరిత్రకు అపకీర్తి తీసుకొచ్చే వారిని మేము వ్యతిరేకిస్తున్నామని చెబుతూ ఒక లేఖ విడుదల చేశారు.

రెమో ఫేం బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి వివేక్ మరియు మెర్విన్ లు సంగీతం అందిస్తున్నారు. డ్రీమ్ వారీయర్ బ్యానర్ పైన ప్రభు సుల్తాన్ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు 'సుల్తాన్' అనే పేరు ఎందుకు పెట్టారు. నిజంగానే టిప్పు సుల్తాన్ కథను నిజంగానే తెరకెక్కిస్తున్నారా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 

More Related Stories