English   

నయనతారపై మండిపడుతున్న మెగా ఫ్యాన్స్..

nayatara
2019-09-30 08:06:51

నయనతార.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 15 సంవత్సరాలుగా తానేంటో ప్రేక్షకులకు చూపిస్తూనే ఉంది నయన్. ఇన్నేళ్ళుగా స్టార్ ఇమేజ్ మెయింటేన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె కోరుకున్నట్లుగానే దర్శక నిర్మాతలు కూడా నడుచుకుంటున్నారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా నయనతార సినిమాలో ఉందంటే ఆమె చెప్పినట్లుగానే వినాల్సిందే. ఇప్పుడు సైరా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ సినిమా కోసం దాదాపు 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంది నయనతార. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రమోషన్ లో కనిపించలేదు. అదే ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించిన తమన్నా మాత్రం తెలుగు, హిందీతో పాటు అన్ని భాషల్లోనూ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ విషయంలో దర్శక నిర్మాతలు కూడా తమన్నాతో పోలిస్తే నయనతార నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఫీల్ అవుతున్నట్లు తెలుస్తుంది. సైరాలో నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార నటించగా.. లక్ష్మీ అనే మరో పాత్రలో తమన్నా కనిపిస్తుంది. 270 కోట్లతో తెరకెక్కిన సినిమా విడుదలవుతుంటే కచ్చితంగా ప్రమోషన్ చేసుకోవాల్సిన బాధ్యత నయనతారపై ఉంది. కానీ ఈమె మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. కనీసం కంటితుడుపుగా కూడా ఓ ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు నయన్. ఎంత స్టార్ హీరోయిన్ అయినా కూడా మరీ ఇంత ఆటిట్యూడ్ పనికిరాదంటూ నయనతారపై మండిపడుతున్నారు అభిమానులు. మెగాస్టార్ సినిమాలో నటించే ఆఫర్ వచ్చినపుడు కచ్చితంగా కొన్ని పద్దతులు తీసి పక్కనబెట్టాలి కానీ ఎప్పుడూ ఒకేలా ఉంటే ఎలా అంటున్నారు వాళ్లు. మొత్తానికి ఎవరెన్ని చెప్పినా తన పద్దతులు మాత్రం మార్చుకోనంటుంది నయన్.

More Related Stories