English   

బ్లాక్ బ్లాస్టర్ డైరెక్టర్స్ తో మెగాస్టార్ లైనప్ 

  chiranjeevi
2019-09-30 08:26:28

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సైరా సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు మరో మూడు బాషలలో కూడా రిలీజ్ చేస్తున్నందున ఆయన అన్ని బాషలలో ప్రమోషన్స్ వేగవంతం చేశారు. మొన్న ముంబై వెళ్లి ఫర్హాన్ అక్తర్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన నిన్న బెంగళూరులో కన్నడ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

కన్నడ నాట కూడా చిరుకు క్రేజ్ ఉందనే విషయం నిన్నటి ఈవెంట్ చూసిన ఎవరికయినా అర్ధం అయిపోతుంది. ఇక ఆయన పలు జాతీయ మీడియా సంస్థలకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే తాజాగా వచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కొత్త సినిమాలపై అభిమానులకు స్పష్టత ఇచ్చాడు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న కొత్త చిత్రం అక్టోబర్‌ లో మొదలవుతుంది ఆ సినిమాని నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమా విషయంలో రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈ విషాయల మీద కూడా కాస్త క్లారిటీ ఇచ్చారు ఆయన. 

ఈ సినిమాలో తనది డ్యుయల్ రోల్ అనే విషయాన్నీ చిరంజీవి తోసిపుచ్చారు. ఇక అదే సమయంలో త్రివిక్రమ్ సినిమా గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ ఓ కథ చెప్పాడని అది తనకి నచ్చడంతో ముందు వెళ్తున్నామని చెప్పారు. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని చెప్పిన ఆయన త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. అలా మొత్తంగా చిరంజీవి తన తర్వాతి రెండు సినిమాల విషయంలో క్లారిటీ ఇచ్చేసినట్టే.

More Related Stories