English   

సొంత గూటికి రాములమ్మ.. కమలనాథులతో చర్చలు.. 

Vijayashanti
2019-09-30 09:17:24

కొన్ని రోజులుగా విజయశాంతి పార్టీ మారుతుందనే ప్రచారం బాగానే జరుగుతుంది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున చాలా కష్టపడినా కూడా పార్టీ ఓడిపోవడంతో పాటు తనకు ఆ పార్టీలో కనీస గుర్తింపు కూడా లేదని రాములమ్మ చాలా బాధ పడుతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈమె పార్టీ మారుతుందనే ప్రచారం జరుగుతుంది. అప్పట్లో ఆమె రాజకీయ ప్రస్థానం బీజేపీతో మొదలైనా.. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంతో సొంత పార్టీకి గుడ్‌బై చెప్పి.. తెలంగాణ సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది. మళ్లీ ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి.. 2009లో టీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేశారు. తెలంగాణ రాష్ట్రా విభజన సమయంలో పార్లమెంట్‌లో కీలకంగా వ్యవహరించింది విజయశాంతి. కానీ ఆ తర్వాత పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వట్లేదని తెరాస నుంచి కూడా బయటికి వచ్చేసింది రాములమ్మ. కేసీఆర్ తో పాటు ఆ పార్టీని కూడా ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉంటుంది విజయశాంతి. కాంగ్రెస్ లో చేరిన తర్వాత మళ్లీ అక్కడ కూడా యాక్టివ్ గా పని చేసింది ఈమె. అయితే అక్కడ ఊహించని పరాభవం ఎదురు కావడంతో ఇప్పుడు మళ్లీ పార్టీ మారే యోచనలో ఉంది ఈమె. ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టి పోరాడాలంటే.. కాంగ్రెస్ లో ఉన్నా లాభం లేదని ఆమె భావిస్తుంది. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న తన సొంత గూటికి వెళ్లిపోవాలని చూస్తుంది విజయశాంతి. పైగా రాజకీయాల్లో ఇప్పుడు చేసేదేం లేకపోవడంతో సినిమాలు కూడా చేస్తుంది విజయశాంతి. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుంది కూడా. ఇక పార్టీ మారే క్రమంలోనే ఈ మధ్యే బీజేపీ అగ్రనేతలు రాములమ్మతో భేటీ అయ్యారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కమలనాథులతో జరిగిన సమావేశం రాములమ్మకు కూడా సంతృప్తి ఇచ్చినట్లు తెలుస్తుంది. అందుకే టైమ్ చూసి పార్టీ మారడానికి అన్నీ సిధ్ధం చేసుకుంటుంది ఈమె. దానికి దసరా పండుగను టార్గెట్ గా చేసుకుంది విజయశాంతి. ఆ రోజే హస్తానికి హ్యాండ్ ఇచ్చి.. కమలపు కండువా కప్పుకోవాలని చూస్తుంది రాములమ్మ. ఒకవేళ అన్నీకుదిరి విజయశాంతి బిజేపీలోకి వస్తే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం కూడా చేయనుందనే ప్రచారం జరుగుతుంది. ఇదే కానీ జరిగిందంటే కచ్చితంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై రాములమ్మ రెచ్చిపోవడం ఖాయం. చూడాలిక ఏం జరగబోతుందో..? 

More Related Stories