కోన వెంకట్ విషయంలో జరుగుతుందేంటి.. కేస్ పెట్టిందెవరు..

కథల కంటే కూడా ఎప్పుడూ కాంట్రవర్సీలతోనే వార్తల్లో ఉంటాడు రైటర్ కోన వెంకట్. ఈయనకు ఫుల్ టాలెంట్ ఉన్నా కూడా అదే స్థాయిలో వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు శ్రీనువైట్లతో వివాదం.. ఆ తర్వాత శ్రీరెడ్డితో యవ్వారం.. ఇప్పుడు మరో కేస్ ఈయన చుట్టూ చేరుతుంది. తాజాగా ఈయనపై ఇప్పుడు ఏకంగా 420 చీటింగ్ కేసు ఫైల్ అయింది. కథ ఇస్తానని ఓ రైటర్ దగ్గర డబ్బులు తీసుకుని.. ఇప్పటి వరకు తాను ఒప్పుకున్న కథ ఇవ్వకపోగా.. తీసుకున్న డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వడం లేదని పోలీస్ స్టేషన్ లో కేస్ ఫైల్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఇలాంటి న్యూస్ రావడమే ఇప్పుడు సంచలనంగా మారుతుంది. నిజానికి కోన రేంజ్ కు 10 లక్షలు పెద్ద మ్యాటర్ కూడా కాదు. కానీ ఎక్కడో తేడా కొడుతుంది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇందులో రాజకీయ కోణాలు కూడా ఉన్నాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఈయన జగన్ పార్టీని సపోర్ట్ చేసాడు. వైసీపీలో కోన వెంకట్ బావ ద్రోణంరాజు శ్రీనివాస్.. బాబాయ్ కోన రఘుపతి ఆంధ్రలో కీలక పదవుల్లో ఉన్నారు. దాంతో ఈయనకు ఇప్పుడు కష్టాలు కూడా ఏం రావు. వాళ్లెలాగైనా ఈ కేస్ ను తారుమారు చేయగలరు. కానీ అసలు ఈయనపై కేస్ పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. అది కూడా అంత చిన్న అమౌంట్ కోసం. ప్రస్తుతం ఈయన నిశ్శబ్ధం సినిమాతో బిజీగా ఉన్నాడు. అనుష్క నటిస్తున్న ఈ చిత్రం ఒకేసారి ఐదు భాషల్లో విడుదల కానుంది.