హాట్ గా రొమాంటిక్ ఫస్ట్ లుక్..

టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పూరీ జగన్నాథ్ తన తమ్ముడు సాయిరాం శంకర్ ని ఎలాగైనా మంచి హీరోను చేయాలని చాలా ట్రై చేసాడు. కానీ ఫలితం దక్కక పోవడంతో ఇప్పుడు కొడుకు ఆకాశ్ విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు. ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఇప్పుడు కొడుకును స్టార్ చేయాలని చూస్తున్నాడు. మెహబూబా సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు ఆకాశ్. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.
ఇప్పుడు ఈయన రెండో సినిమాగా చేస్తున్న ‘రొమాంటిక్’ మూవీ ఫస్ట్‌లుక్ విడుదలైయింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఢిల్లీకి చెందిన మోడల్ కెతికా శర్మ హీరోయిన్గా నటిస్తున్న తొలిచిత్రంలోనే ఫస్ట్‌లుక్‌లో అందాల ఆరబోతతో ఆదరగొట్టింది. టాప్ లెస్ బ్యాక్ ఫోటోతో కుర్రకారుల మతిపోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్‌లుక్ విడుదలైన కొన్ని నిముషాల్లోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ సినిమాని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథ్ అందిస్తుండగా అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. వీఎఫెక్స్ సంస్థ నడిపిన ఆయనకు ఇదే తొలి చిత్రం. ‘రొమాంటిక్’ ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నరేశ్ సినిమాటోగ్రఫీని అందించారు. మందిరా బేడి, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ ఫస్ట్ లుక్ ఎలా ఉందొ మీరు కూడా ఓ లుక్కెయ్యండి.