English   

ఆపరేషన్‌ కి నో చెప్పిన పవన్‌

Pawan Kalyan
2019-09-30 16:24:59

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. నిజానికి గబ్బర్ సింగ్ టైంలో ఒక ఫైట్ చేస్తున్న క్రమంలో ప్రమాదానికి గురయిన ఆయన ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో విపరీతంగా తిరగడంతో నొప్పి తీవ్రం అయ్యింది. దీంతో ఆయన ఇటీవలే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షించిన వైద్యుల బృందం పరిస్థితి మరింత విషమించక ముందే శస్త్ర చికిత్స చేయించుకుంటే మంచిదని సూచించారు. అయితే ఇందుకు పవన్‌ కల్యాణ్‌ అంగీకరించలేదని చెబుతున్నారు. నిజానికి ఇదే విషయాన్ని పవన్ మొన్న రాసిన లేఖలో పేర్కొన్నారు. 

అయితే సర్జరీ చేయించమని వైద్యులు సూచించిన నేపధ్యంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. పవన్ ఆపరేషన్ కు అంగీకరించలేని పార్టీ కార్యకలాపాలను కొంతకాలం పక్కన బెట్టి అయినా సరే వెన్ను నొప్పి కోసం నేచర్ క్యూర్ పద్ధతి(ప్రకృతి వైద్యం)లోనే చికిత్స చేయించుకోవాలని పవన్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. పవన్‌ ట్రీట్‌మెంట్‌కు వెళితే కొన్నాళ్లపాటు పార్టీకి అందుబాటులో ఉండక పోవచ్చని, వెన్నునొప్పి పూర్తిగా తగ్గగానే పవన్ మళ్లీ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారని ఆ పార్టీలో చర్చ సాగుతోంది.  

More Related Stories