English   

సరిలేరు నీకెవ్వరూలో తమన్నా పూజా హెగ్డే

 Sarileru Neekevvaru
2019-09-30 16:42:11

మహర్షి సినిమా హిట్ జోష్ మీదున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సెట్స్‌ కి వెళ్ళాడు. అదే ఊపు మీదున్న అనిల్ రావిపూడి కూడా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా నడుస్తోంది. ఈ సినిమాని సంక్రాంతి రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించారు. దాంతో షెడ్యూల్ బ్రేక్స్ కూడా లేకుండా లాగించేస్తున్నారు. ఇక ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ అనుకున్న సినిమాల్లో అంచనాల పరంగా సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇక ఈ సినిమాకి మరిన్ని అదనపు ఆకర్షణలు సిద్దం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా ఇంట్రో కోసం తమన్నా డ్యాన్స్ వేయనుందని ప్రచారం జరగగా ఆ విషయాన్ని తాజాగా ఆమె ఖరారు చేసింది కూడా. 

అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో స్పెషల్ సాంగ్ కూడా ఉందట. ఆ సాంగ్ లో మహేష్ తో కలిసి పూజా హెగ్డే నర్తించనున్నట్టు తెలుస్తోంది.  పూజా మహేష్ ఇద్దరూ కలిసి మహర్షి చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది, సో, ఈ సినిమాలో రష్మికతో పాటు తమన్నా, పూజా హెగ్డేలు కూడా కనిపించబోతున్నారనేది ఫిలిం నగర్ వర్గాల్లో రొటేట్ అవుతోన్న న్యూస్.  సరిలేరు చిత్రానికి దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఇంట్రో సాంగ్ అలాగే స్పెషల్ సాంగ్స్ కి దేవీశ్రీ స్పెషల్ ట్యూన్స్ సిద్ధం చేస్తున్నాడట. అలాంటి సాంగ్స్ అంటే దేవికి వెన్నతో పెట్టిన విద్య కావడంతో ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు నెలకొంటున్నాయి.

More Related Stories