English   

దసరాకు బాలయ్య రచ్చ.. టీజర్ తో రానున్న రూలర్.. 

Balakrishna
2019-09-30 17:26:47

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తుంది. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే కూడా వేగంగా జరుగుతుంది. మొన్నటి వరకు థాయ్ లాండ్ లో జరిగిన ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లోనే జరుగుతుంది. జై సింహా లాంటి హిట్ సినిమా తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇందులో బాలయ్య విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. దీనికోసం గెటప్ కూడా మార్చేసాడు. అంతేకాదు ఈ చిత్రం కోసం 11 కేజీల బరువు కూడా తగ్గిపోయాడు ఈయన. ఇప్పుడు షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. దసరా కానుగా ఈ చిత్ర టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సి కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బాలకృష్ణ 105వ సినిమాగా వస్తున్న దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. లెజెండ్, డిక్టేటర్ సినిమాల్లో బాలయ్యతో జోడీ కట్టిన సోనాల్ చౌహాన్ ఇందులో హీరోయిన్. ఇక వేదిక మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర తర్వాతి షెడ్యూల్ అక్టోబర్ 5 నుంచి మొదలు కానుంది. ఇందులో బాలయ్యతో పాటు ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలయ్య సినిమాకు మరోసారి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. దసరాకు విడుదల కానున్న టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుందని నమ్ముతున్నారు చిత్రయూనిట్. సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. ముందు సంక్రాంతికి అనుకున్నా కూడా షూటింగ్ ఆలస్యం కావడంతో పండగ బరి నుంచి తప్పుకున్నాడు బాలయ్య. 

More Related Stories