English   

మహేష్ బాబుకు షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ డైరెక్టర్..

Parasuram
2019-09-30 18:11:56

బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకులను కూడా ఒక్కోసారి వెయిటింగ్ లిస్టులో పెట్టేస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన ఉన్న బిజీకి ఒక్కోసారి కథలు కుదిరినా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది దర్శకులకు. ఇది కొందరికి నచ్చుతుంది.. మరికొందరికి మాత్రం నచ్చట్లేదు. అలా నచ్చని వాళ్లు మరో హీరోలను చూసుకుంటున్నారు. కొన్నిసార్లు అయితే మహేష్ బాబే ఆ దర్శకులకు నో చెప్పేస్తున్నాడు. సుకుమార్ ఇందులో ఉన్నాడు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈయనతో సినిమా చేయడానికి హీరోలు పోటీ పడుతుంటే.. మహేష్ కోసం ఈయన కథ సిద్ధం చేసుకున్నాడు. కానీ చివరి నిమిషంలో కథ నచ్చలేదని సుకుమార్ కు నో చెప్పాడు సూపర్ స్టార్. ఇదే కథను ఇప్పుడు బన్నీతో చేస్తున్నాడు ఈయన. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో దర్శకుడు కూడా మహేష్ నుంచి దూరంగా వెళ్లాడు. అయితే ఈ సారి మహేష్ బాబు కాదు.. ఆ దర్శకుడే దూరం జరిగాడు. అతడే పరుశురాం.. గతేడాది విజయ్ దేవరకొండతో గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈయన.. మహేష్ కోసం కథ సిద్ధం చేసుకుని వెళ్తే వెయిటింగ్ లిస్టులో పెట్టాడని తెలుస్తుంది. అందుకే ఈయన ఇప్పుడు అక్కినేని వారసుడు అఖిల్ తో సినిమా చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీనికోసం భారీ పారితోషికం అందుకుంటున్నాడు ఈయన. మొత్తానికి హిట్ ఇచ్చిన తర్వాత ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకూడదని మహేష్ కోసం వేచి చూడటం కంటే అఖిల్ సినిమాతో హిట్ కొట్టి తానేంటో చూపించాలని చూస్తున్నాడు పరుశురాం. మొత్తానికి మహేష్ బాబు నుంచి ఒక్కో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అలా జారిపోతున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. 

More Related Stories