English   

జోష్ లో బాలయ్య...క్రిష్ కి ఓకే చెప్పినట్టే

nbk
2019-09-30 20:06:21

ప్రస్తుతం బాలకృష్ణ కే.యస్ రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమాలో బాలయ్య కొత్త లుక్‌లో చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక మరో కీలక పాత్ర పోషిష్తోంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. ఈ సినిమా రిలీజైన వెంటనే బాలయ్య తన కెరీర్లో అచ్చొచ్చిన బోయపాటితో 106వ సినిమా పట్టాలెక్కించనున్నాడు.

రవి కుమార్ సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమా మొదలెట్టి సమ్మర్ కి పూర్తి చేసి అదే సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట. ఇక సమ్మర్ కే ఈ సినిమా పూర్తి చేసేసి వెనువెంటనే పూరీతో 107వ సినిమా చేస్తారట. విజయ్ దేవరకొండతో ఇప్పటికే సిన్మా ప్రకటించిన పూరీ బాలయ్య కోసం కధ స్క్రిప్ట్ తో సహా సిద్దం చేసేశారట. ఇక అక్కడితో ఆగని బాలయ్య తన 108 వ సినిమాను కూడా లైన్లో పెట్టేసారని ఫిలింనగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేయనున్నారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలకు దర్శకత్వం వహించగా గౌతమిపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ గా నిలిచినా ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో చేసిన రెండు భాగాలు ‘కథానాయకుడు, మహానాయకుడు’ అంతగా మెప్పించలేదు. ఈ సినిమాల తర్వాత మరొక ప్రాజెక్ట్ ఏదీ ఒప్పుకోని క్రిష్ మళ్ళీ బాలయ్యతోనే సినిమా చేయడానికి ప్లాన్ చేసుకోవడం విశేషం. నిజానికి 105వ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నా  కాస్త ముందుగా డిసెంబర్‌ నెలలోనే విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారని అంటున్నారు. ఈ దసరా సందర్భంగా ఫస్ట్ లుక్‌లో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించి ఈ ఏడాది చివర్లోనే విడుదల చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.  

 

More Related Stories