English   

రానా దగ్గుబాటిని చూసి భయపడుతున్న అభిమానులు.. 

Rana Daggubati
2019-10-01 14:59:46

దగ్గుబాటి వారసుడు రానాను తలుచుకోగానే ఆజానుబాహుడు గుర్తుకొస్తాడు. ఆయన కటౌట్ అలా ఉంటుంది మరి. ఇప్పుడు కూడా ఇలాగే ఉంటాడేమో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు రానా చాలా మారిపోయాడు. ఒకటి రెండు కాదు.. చాలా కేజీలు తగ్గిపోయాడు. అసలు రానాను చూస్తుంటే ఇంతకుముందు మనం చూసిన హీరో ఇతడేనా అనిపించక మానదు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నాడు దగ్గుబాటి హీరో. అందుకే విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కిడ్నీలకు సంబంధించిన ఆపరేషన్ అయిందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. అయితే ఇది నిజమే అని కొందరు అంటుంటే అలాంటిదేం లేదని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఎవరేం అన్నా కూడా రానాను చూస్తుంటే ప్రస్తుతం మనోడు ఉన్న పరిస్థితిని గమనిస్తుంటే షాక్ తప్పదు. ఎందుకంటే అంత బరువు తగ్గిపోయాడు ఈ హీరో. అసలు ఒకప్పుడు రానా వేరు.. ఇప్పుడు మనం చూస్తున్న రానా వేరు అంటే ఈజీగా నమ్మేయొచ్చు. అంతగా మారిపోయాడు ఈయన. ఇన్ స్టాగ్రామ్ లో రానా పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. అది చూసిన తర్వాతే అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. 

More Related Stories