English   

పూరీ జగన్నాథ్ రొమాంటిక్ సినిమా పోస్టర్ పై విమర్శలు.. 

Romantic poster
2019-10-01 15:32:02

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా కొత్త దర్శకుడు అనిల్ తెరకెక్కిస్తున్న సినిమా రొమాంటిక్. ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్ కేతిక శర్మ ఇందులో ఆకాశ్ తో నటిస్తుంది. మెహబూబా ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం ఈ కుర్ర హీరో ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన రొమాంటిక్ సినిమా పోస్టర్ పై విమర్శల వర్షం కురుస్తుంది. ఈ చిత్ర పోస్టర్ గురించి మహిళా సంఘాలు కూడా గోల పెడుతున్నాయి. అసలు ఏ ఉద్దేశ్యంతో ఇలాంటి సినిమాలు చేస్తున్నారంటూ వాళ్లు రచ్చ చేస్తున్నారు. బ్యాక్ లెస్ పోజుతో ఈ పోస్టర్ విడుదల చేసాడు దర్శకుడు అనిల్. దీనికి కథ, స్క్రీన్ ప్లే పూరీ అందిస్తున్నాడు. మెహబూబాతో ఎలాగూ హిట్ ఇవ్వలేకపోయిన పూరీ.. రొమాంటిక్ తో కచ్చితంగా హిట్ ఇవ్వాలనే కసితో కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అయితే ఈ పోస్టర్ లో ఉన్న అశ్లీలత చూస్తుంటే యూత్ చెడిపోడానికే అన్నట్లుంది అంటున్నారు విమర్శకులు. మరీ ఇంత తెగింపా అంటూ పూరీపై కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే ఎవరేం అన్నా కూడా ఇది రొమాంటిక్ అంతే అంటున్నాడు డేరింగ్ డైరెక్టర్. 

More Related Stories