English   

గోపీచంద్‌ సినిమాకు థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారా..

Gopichand
2019-10-01 16:33:27

ఏమో అప్పుడప్పుడూ ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి. అప్పట్లో ఓ పెద్ద సినిమా వచ్చిందని తన సినిమాను తీసేసారంటూ మంచు మనోజ్ లాంటి హీరోలు కూడా బయటికి వచ్చి రచ్చ చేసారు. మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలో చిన్న సినిమాలను చంపేస్తున్నారంటూ గోల చేసింది. ఇప్పుడు గోపీచంద్ చాణక్య సినిమా విషయంలోనే ఇలాంటిదే జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. దానికి మూడు రోజుల ముందే సైరా సినిమా వస్తుంది. అయితే చిరంజీవి వస్తున్నాడు కాబట్టి గోపీచంద్ సినిమాకు థియేటర్స్ ఇవ్వొద్దంటూ చాణక్య నిర్మాతలకు ఇండస్ట్రీలో ఓ బడా నిర్మాత నుంచి బెదిరింపులు వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. దీనిపై గోపీచంద్ ఏం మాట్లాడటం లేదు కానీ కచ్చితంగా గోపీ సినమాకు థియేటర్స్ ఇవ్వకుండా కుట్ర మాత్రం జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. సైరాకే అన్ని స్క్రీన్స్ ఇవ్వాలని.. గోపీ సినిమాకు ఇవ్వకూడదని ఎగ్జిబిటర్లకు కూడా వార్నింగ్ వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు చల్లబడినట్లు తెలుస్తుంది. అక్టోబర్ 5న చాలా తక్కువ థియేటర్లలో చాణక్య విడుదల కానుంది. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు తిరు తెరకెక్కించాడు. 

More Related Stories