English   

సైరా నరసింహా రెడ్డి ఇండస్ట్రీ టాక్.. సినిమా ఎలా ఉండబోతుందంటే

Sye Raa Review.jpg
2019-10-01 23:25:33

సైరా నరసింహారెడ్డి ఎలా ఉండబోతుంది.. మెగాస్టార్ 20 ఏళ్ల కల స్క్రీన్ పై ఎలా కనిపించబోతుంది.. ఇప్పుడు ఎవరిని కదిపినా కూడా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. కచ్చితంగా సైరా సినిమా సంచలనం సృష్టిస్తుందని మెగాభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతోంది.. ఎలా మొదలవుతుంది.. ఎలా ముగుస్తుంది అనే విషయాలపై చర్చలు బాగానే జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం సైరా నరసింహారెడ్డి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుందని తెలుస్తుంది. ఆ తర్వాత అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో మెరుస్తుంది. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో తమ సైనికుల్లో స్పూర్థి నింపడానికి ఒక వీరుడి కథ చెబుతుంది ఝాన్సీ లక్ష్మీభాయి. ఆ వీరుడి పేరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అతని కథను స్ఫూర్తిగా చెబుతూ తమ సైనికుల్లో స్వతంత్ర కాంక్ష్యను రగిలిస్తుంది ఝాన్సీ. అలా ఉయ్యాలవాడ కథను దర్శకుడు సురేందర్ రెడ్డి మొదలు పెట్టాడని తెలుస్తుంది.

ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా ఉయ్యాలవాడ జీవితం.. ఆయన ఎదిగిన తీరు చూపిస్తారని.. ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి బ్రిటిష్ వాళ్ళపై దండయాత్ర మొదలవుతుందని ప్రచారం జరుగుతుంది. ఒక్కసారి తెల్లవాళ్లపై తిరుగుబాటు మొదలైన తర్వాత వచ్చే యుద్ధ సన్నివేశాలు సినిమాకి ప్రధాన హైలైట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. తన వయసును కూడా మరిచిపోయి చిరంజీవి ఈ యుద్ధ సన్నివేశాలు చేశాడని.. ముఖ్యంగా కత్తి సాములో మరోసారి తన ప్రత్యేకతను చూపినట్లు తెలుస్తోంది. అండర్ వాటర్ యాక్షన్ సన్నివేశాలు అలాగే గొరిల్లా యుద్ధాలు సైరాలో ప్రధాన ఆకర్షణ. ఎటు చూసుకున్నా కూడా సైరా నరసింహారెడ్డి ప్రేక్షకులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.

More Related Stories