English   

సైరా సినిమా బెనిఫిట్ షోలు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయంటే..

chiru
2019-10-02 07:35:33

సైరా మేనియా ఇప్పుడు అందరినీ ఊపేస్తుంది. ఎక్కడ ఎవరిని కదిపినా కూడా చిరంజీవి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు చిరు సినిమా వస్తుందంటే సందడి ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు అది మరింత పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సైరా ఫీవర్ పట్టుకుంది. అక్టోబర్ 2న తెలుగు రాష్ట్రాలలో ఉన్న దాదాపు 90 శాతం థియేటర్లలో సైరా నరసింహారెడ్డి ప్రదర్శితం కానుంది. ఇదిలా ఉంటే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలలో కూడా సైరా రికార్డులను తిరగరాస్తుంది. ఏపీలో ఇప్పటికే చాలా చోట్ల ఉదయం 5:30 నుంచి బెనిఫిట్ షోలు పడనున్నాయి. ఇక చెన్నైలో కూడా సైరా హవా నడుస్తుంది. అక్కడ ఏకంగా 50 స్పెషల్ షోలు సైరా నరసింహారెడ్డి కోసం ఏర్పాటు చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. తమిళనాట సూపర్ గుడ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది. అక్కడ కూడా భారీగానే విడుదలవుతుంది. పైగా అక్కడ తెలుగు ప్రేక్షకుల కోసం 50 ప్రత్యేక షోలు తెలుగు వర్షన్ ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన సాహో సినిమాకు కూడా కేవలం 30 షోలు మాత్రమే వేశారు. ఇప్పుడు చిరంజీవి సైరా కోసం అంతకంటే ఎక్కువ షోలు పడుతున్నాయి. తొలిరోజు కచ్చితంగా ఈ చిత్రం 80 నుంచి 100 కోట్ల షేర్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. తెలుగులో సరికొత్త రికార్డును సృష్టించడానికి సైరా సిద్ధమవుతుంది.

More Related Stories