English   

సైరా సినిమా విషయంలో పరుచూరి బ్రదర్స్ అసంతృప్తి..

bro
2019-10-02 07:56:47

ఈ రోజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ తెరమీదకు వచ్చిందంటే చిరంజీవి కష్టం ఎంతుందో.. దానికంటే ఎక్కువగా మరో ఇద్దరి కృషి కూడా ఉంది. అసలు చిరంజీవికి ఉయ్యాలవాడ ఆలోచన తెప్పించిందే వాళ్లు. వాళ్లే పరుచూరి బ్రదర్స్.. వీళ్లే కథ రాసి.. చిరంజీవిని ఆ పాత్రలో ఊహించుకుని కమర్షియలైజ్ కూడా చేసారు. 15 ఏళ్ల కిందే ఈ కథ రాసారు ఈ ఇద్దరూ. ఇప్పుడు మారిన పరిస్థితులను బట్టి కథకు మరిన్ని మెరుగులు దిద్దారు. అయితే అప్పుడనుకున్న కథ.. ఇప్పుడు తెరకెక్కిన కథ ఒకటి కాదని షాకింగ్ నిజాలు బయటికి వస్తున్నాయి. పదేళ్ల క్రితం పరుచూరి బ్రదర్స్ సైరా కథ రాసుకున్న మాట నిజమే.. దానికి తగ్గట్టుగానే టైటిల్స్ లో కూడా మూల కథగా వారికే అగ్ర తాంబూలం ఇచ్చాడు చిరంజీవి. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా తమకు మూల కథ ఇచ్చింది పరుచూరి సోదరులే అని చెప్పాడు.

అయితే ఆ తర్వాత సురేందర్ రెడ్డి టీం ఈ కథకు మరిన్ని మెరుగులు దిద్దారని తెలుస్తుంది. వాళ్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాతే కథను రీసర్చ్ చేసి దానికి పూర్తి రూపం తీసుకొచ్చారని ప్రచారం జరుగుతుంది. అందుకే పరుచూరి బ్రదర్స్ ఇచ్చిన కథని పక్కన బెట్టేసారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పరుచూరి బ్రదర్స్ కూడా దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కథ విషయంలో సురేందర్ రెడ్డి అండ్ టీం ఎక్కువ కష్టపడ్డారని వాళ్లకు కూడా తెలుసు. అంతేకాదు సినిమా డైలాగ్స్ కూడా సాయి మాధవ్ బుర్రా తనదైన ముద్ర వేయడానికి చూస్తున్నాడు. అయితే ఇప్పుడు అసలు అనుమానం.. పరుచూరి సోదరులు ఇచ్చిన కథను కాస్తైనా తీసుకున్నారా లేదంటే ఐడియా మాత్రమే తీసుకుని పూర్తిగా కొత్త కథ రాసుకున్నారా అనేది చూడాలి. ఏదేమైనా తాము ఇచ్చిన కథను మార్చినందుకు బ్రదర్స్ బాగానే హర్ట్ అయ్యారని తెలుస్తుంది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పరుచూరి గోపాల కృష్ణ రాలేదంటున్నారు. మొత్తానికి మరి ఇందులో నిజమెంతో చూడాలిక.

More Related Stories