English   

సైరా ఎఫెక్ట్...ఆరుగురు ఎస్సైల మీద వేటు

sye raa
2019-10-02 13:36:39

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా’సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్బంగా ఈ సినిమాను విడుదల చేశారు. అయితే చిరంజీవి కి ఉన్న క్రేజ్, ఈ సినిమా మీదున్న అంచనాల దృష్ట్యా అభిమానులంతా అర్థరాత్రి నుంచే థియేటర్లకు క్యూ కట్టారు. అయితే ఏపీలో కొందరు పోలీసులు కూడా చిరు సినిమాకి వెళ్లి కొంప మీదకి తెచ్చుకున్నారు. కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో ఆరుగురు ఎస్సైలు సైరా సినిమాకు వెళ్లారు. వేకువజామున కోవెలకుంట్లలో ఆరుగురు ఎస్సైలు ‘సైరా’ సినిమాకు వెళ్లారు. మామూలుగా వెళ్లి ఉంటె ఇబ్బంది ఉండేది కాదేమో కానీ వారు డ్యూటీలో ఉండి సినిమాకు వెళ్ళడంతో అలా ఎలా వెళ్తారంటూ పై అధికారులు సీరియస్ అయ్యారు. ఎలాంటి సమాచారం లేకుండా సినిమాకు వెళ్లిన ఆరుగురు ఎస్సైలపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నారు. వెంటనే వారిని వీఆర్‌ కు బదిలీ చేస్తున్నట్లు ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. మెగాస్టార్ కు తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానులు ఉంటారు. కుల, రాజకీయాలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉంటారు. అయితే ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కధ జరిగింది కూడా కోవెలకుంట్ల పరిసరాల్లోనే కావడం విశేషం. ఈ సినిమా షూట్ కూడా కొంచెం భాగం అక్కడ జరిగింది. 

More Related Stories