బాలీవుడ్ కి పూరీ...అయ్యే పనేనా

ఎన్టీఆర్, ఏఎన్నార్ టైంలో అప్పటి సినిమాల కథలను బాలీవుడ్ వాళ్ళు అక్కడ రీమేక్ చేసేవారు. మళ్లీ ఆరోజుల్ని గుర్తు చేస్తూ ఈ మధ్య బాలీవుడ్ నిర్మాతల చూపు తెలుగు సినిమా కథల మీద పడింది. మన దగ్గర హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు నిర్మాతలు. ఇప్పటికే 'అర్జున్ రెడ్డి' రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో వాటిలో 'జెర్సీ, ఆర్ఎక్స్100' ఎవడు సినిమాల రైట్స్ కొనేసి షూట్ లు కూడా మొదలెట్టారు. మొన్న వచ్చిన 'డియర్ కామ్రేడ్' చిత్రం యొక్క హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా తాజా సమాచారం ప్రకారం మరొక తెలుగు చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని కూడా ప్రచారం అయ్యింది సమంతా ప్రధాన పాత్రలో వచ్చిన ఓ బేబీ కూడా రీమేక్ కానుందట. ఇక తాజాగా బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కూడా రీమేక్ అవుతుందట. రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర మంది కలెక్షన్స్ రాబట్టింది.
దాంతో ఈ సినిమాని బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. పూరి దర్శకత్వంలో వచ్చిన బద్రి, పోకిరి, టెంపర్ సినిమాలు హిందీలో షర్త్, వాంటెడ్, సింబా పేర్లతో రీమేక్ అయ్యి వాంటెడ్,సింబా సినిమా బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. సింబాలో కూడా రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించాడు. ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా పూరీనే దర్శకత్వం చేయమని అడుగుతున్నారని టాక్. గతంలో పూరీ హిందీలో అమితాబ్ తో బుడ్డా హో గయా తేరే బాప్ సినిమా తీశారు. అది పెద్దగా ఆడలేదు. ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాకున్నా ఫిలిం నగర్ లో మాత్రం జోరుగా ప్రచారం అవుతోంది.