English   

అప్పుడు అన్న వంతు ఇప్పుడు తమ్ముడు వంతు

bollywood
2019-10-03 07:29:26

తెలుగులో విజయ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్‌లో కూడా రీమేక్ ని డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ మీద కూడా బాలీవుడ్ చూపు పడింది ఈలోపు మనోడు డియర్ కామ్రేడ్ అంటూ ఒక సినిమా చేసి అది పాన్ ఇండియా మొత్తం రిలీజ్ చేయడంతో  బాలీవుడ్ లో కూడా ఆ సినిమా రిలీజ్ అయ్యింది.

ఇక విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబోతున్నారట. అదే గీత గోవిందం. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. గీతా ఆర్ట్స్ కామ్పుండ్ వాళ్ళు చేసిన ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి కొనుక్కున్నారని అంటున్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన లేకున్నా ఆ రైట్స్ కొన్నారని మాత్రం బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌ మీద కరణ్ జోహార్ నిర్మించనున్నారట.

ఇందులో హీరోగా నటించబోయేది  షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ అని అంటున్నారు. ధడక్ సినిమాలో ఝాన్వతో కలిసి నటించిన ఇషాన్ ‘గీత గోవిందం’ సినిమా రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. అన్న షాహిద్ కాపూర్ ‘కబీర్ సింగ్’లో నటించి బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు తమ్ముడు ‘గీత గోవిందం’లో నటించనున్నాడు. మరి ఇతనికి విజయ్ దేవరకొండ సినిమా కలిసొస్తుందో లేదో చూడాలి. 

More Related Stories