English   

సైరా ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్.. దండెత్తిన చిరంజీవి..

Sye Raa Narasimha Reddy Collections.jpg
2019-10-03 10:44:03

మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. మిగిలిన భాషల సంగతి పక్కన పెడితే తెలుగులో మాత్రం బాక్సాఫీస్ పైకి దండెత్తాడు మెగాస్టార్. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి.

ఇప్పుడు వాటిని నిలబెట్టుకుంటూ తెలుగులో తొలి రోజు దాదాపు 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది సైరా నరసింహారెడ్డి. మిగిలిన భాషల్లో కూడా మంచి వసూళ్లు వైపు పరుగులు పెడుతుంది చిరంజీవి సినిమా. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమాకు ఊహించిన కలెక్షన్స్ రాలేదు. అక్కడ హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ నటించిన వార్ సినిమా అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమాకు యావరేజ్ రేటింగ్స్ ఇచ్చినా కూడా ఇద్దరు స్టార్ హీరోలు ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ప్లాన్ బాగానే వర్కవుట్ అయ్యింది. తొలిరోజు ఈ చిత్రానికి 45 కోట్లకు పైగా నెట్ వచ్చిందని తెలుస్తోంది. అదే సైరా నరసింహారెడ్డి మాత్రం కేవలం 5 కోట్ల తోనే సరిపెట్టుకొని వార్తలు వినిపిస్తున్నాయి.

పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఎందుకో తెలియదు కానీ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో మాత్రం సైరా నరసింహారెడ్డి అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. మరో నాలుగు రోజులు ఇలాగే వసూళ్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 60 కోట్లకు పైగా షేర్ సైరా నరసింహారెడ్డి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్స్ తో కలుపుకొని 1 మిలియన్ క్రాస్ చేసింది సైరా.

More Related Stories