English   

రీ ఎంట్రీకి సిద్దమయిన అందాల నటి

Shobana
2019-10-03 16:05:43

తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో తనకంటూ విలక్షణ గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి శోభన నాగార్జున తొలిచిత్రం విక్రమ్ ద్వారా టాలివుడ్ కి పరిచయమై మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. చెన్నైలో డాన్స్ స్కూల్ నెలకొల్పిన ఈమె ఎందరికో శిక్షణ ఇస్తూ, నాట్యకారులను తీర్చిదిద్దుతోంది. అయితే ఇంతవరకూ ఆమె పెళ్లిపీటలు ఎక్కకుండా ఒంటరిగా ఉండిపోయింది. తనకన్నా చిన్న వాడు,అప్పటికే పెళ్ళైన రాహుల్ నెహ్రా అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అ తర్వత ఆమె వాటిని ఖండించింది కూడా. తమిళంలో ఎనక్కుల్‌ ఒరువన్‌ చిత్రం ద్వారా కమలహాసన్‌కు జంటగా నటనకి పరిచయమైన శోభన, ఆ తరువాత తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ చిత్రాల్లో నటించి బహుభాషా నటిగా ఫేమస్ అయ్యరు. 

సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించిన శోభన  రీ ఎంట్రీకి సిద్దం అయ్యింది.  ఇంకా పేరు పెట్టని ఒక మళయాళ సినిమాలో ఆమె నటించనుందని అంటున్నారు. దర్శకుడు అనూప్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో సురేష్‌ గోపీ, దుల్కర్‌ సల్మాన్, కల్యాణి ప్రియదర్శన్‌లు నటిస్తున్న ఈ సినిమాలో శోభన కూడా కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. నిజానికి శోభన మలయాళంలో ఆరు సంవత్సరాల క్రితం వినీత్‌ శ్రీనివాసన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘తిర’ అనే సినిమాలో రోహిణి ప్రణబ్‌ అనే కార్డియాక్ సర్జన్ గా నటించింది. మళ్లీ ఇప్పటి వరకు వెండితెరపై నటించలేదు. దీంతో ఈ సినిమా ఆమెకి రీ ఎంట్రీ అనే చెప్పాలి.

More Related Stories