కొత్త సినిమా ప్రకటించిన శ్రీ విష్ణు

చేసే అన్ని సినిమాలు విభిన్నమైన సినిమాలే చేసే శ్రీ విష్ణు హీరోగా మరో కొత్త సినిమా ప్రకటించాడు. ఈ సంవత్సరం ప్రధమాంకంలైన్ బ్రోచేవారెవరురా అనే సినిమాతో మంచి హిట్టును అందుకున్నాడు హీరో శ్రీవిష్ణు ... ప్రస్తుతం శ్రీవిష్ణు తిప్పరామీసం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తాజాగా ప్రకటించిన శ్రీవిష్ణు కొత్త సినిమా ప్రారంభం కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ల మీద ఓ సినిమా తెరకెక్కనున్నది. హాసిత్ గోలి అనే యువకుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఇక టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నారు.
ఈ ఏడాది చివరలో ప్రారంభం కానున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కి పూర్తి చేయాలని భావిస్తున్నారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలకి దర్శకత్వ శాఖలో వివేక్ ఆత్రేయ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన హాసిత్ గోలి కొత్త లైన్ తో ఈ కధ రాసుకున్నాడట. ఇక శ్రీవిష్ణు ‘తిప్పరామీసం’ సినిమా మీద అంచనాలు లేవు కానీ కిందటి నెలలో వచ్చిన టీజర్, ఒక పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు అసుర విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. బహుశా ఈ ఏడాది చివర్లో అది కూడా రిలీజ్ కావచ్చు.