English   

జోరుమీదున్న గోపీ చంద్...మరో సినిమా ప్రారంభం

Gopichand
2019-10-03 16:34:43

ఒకప్పుడు మూస కధలకే పరిమితం అయిన గోపీ చంద్ ఇప్పుడు పంధా మార్చాడు. వినూత్నమైన కథాంశాలతో సరికొత్త పాత్రల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతున్నాడు. సినిమా రిజలట్ తో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. మరో రెండు రోజుల్లో చాణక్యతో థియేటర్లకి రానున్న గోపీ మరో రెండు సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. తాజాగా గోపీచంద్‌ తన 28వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం సంపత్‌ నందికి ఇచ్చిన విషయం తెలిసిందే. ‘గౌతమ్‌నంద’తో నిరుత్సాహపరిచినప్పటికీ ఈ సారి బలమైన స్క్రిప్ట్‌తో రావడంతో సంపత్‌ నందికి ఈ యాక్షన్‌ హీరో‌ మరోసారి అవకాశం ఇచ్చాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. 

పూజా కార్యక్రమాల అనంతరం మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తొలి క్లాప్‌ కొట్టడంతో షూటింగ్‌ ప్రారంభమైంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ నెం.3 గా యూ టర్న్ నిర్మించిన శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో కొత్త దర్శకుడు బిను సుబ్రమణ్యం డైరెక్షన్‌లో గోపీచంద్‌ హీరోగా మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తిరు దర్శకత్వంలో గోపిచంద్ నటించిన 'చాణక్య' దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా హిట్ అయితే గోపీ మళ్ళీ ట్రాక్ లో పడ్డట్టే.

More Related Stories