జూనియర్ బెల్లంకొండ హీరోగా సినిమా లాంచ్...ఆమె హీరోయిన్

తొలి సినిమాతోనే మాస్ హీరోగా ముద్ర వేసుకోవాలని ట్రై చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. మొదటి సినిమాతోనే పెద్ద హీరోలకి పెట్టె బడ్జెట్ తో లాంచ్ అయిన అయన ఆ తరువాత కూడా స్టార్ హీరోయిన్స్ తో జోడీ కడుతూ భారీ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక ఎన్నో ప్రయత్నాల తర్వాత మొన్న వచ్చిన రాక్షసుడు సినిమాతో ఫస్ట్ సినిమా హిట్ అందుకున్నాడు శ్రీనివాస్, ఇక ఆయన సోదరుడు గణేష్ సినిమాల్లోకి రానున్నాడనే ప్రచారం ఒక ఎదాదినన్నర నుండి జరుగుతూనే ఉంది, గత ఏడాది డిసెంబర్ లోనే ఆయన హీరోగా లాంచ్ అవుతాడని, ఆ సినిమా ద్వారా ఫణి అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడని కూడా ప్రచారం జరిగింది.
ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సినిమా గురించి అప్డేట్ లేదు. తాజాగా ఈ యంగ్ హీరో చిత్రం ప్రారంభమవుతుందనే విషయం బయటకు వచ్చింది. అక్టోబరు 5న అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా ఆయన మొదటి సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారని సమాచారం. గతంలో వచ్చిన ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ‘సావిత్రి’ సినిమాల దర్శకుడు పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాకు రాధన్ సంగీతం అందిస్తాడని.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫే అందిస్తాడని సమాచారం. టాలీవుడ్ లో కొత్త హీరోను పరిచయం చేస్తున్నారంటే దాదాపుగా ఆ సినిమా లవ్ స్టొరీనే అయి ఉంటుంది.
గణేష్ డెబ్యూ సినిమా కూడా అదే అని అంటున్నారు. ఈ సినిమాలో గణేష్ కు జోడీగా నటించే హీరోయిన్ నభా నటేష్ ని అనుకుంటున్నారట. ఇక ఇతర నటీనటుల వివరాలు సినిమా లాంచ్ రోజునే వెల్లడవుతాయని అంటున్నారు. బెల్లంకొండ గణేష్ తన తండ్రి నిర్మించే పలు సినిమాలకి ఎక్సిగ్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. బొద్దుగా లావుగా ఉండే గణేష్ కు నటన మీద గాలి మల్లడంతో ఫిజిక్ మీద దృష్టి పెట్టి లావు తాగ్గాడు. అంతేకాదు నటనలో , డ్యాన్స్ , ఫైట్స్ లలో శిక్షణ తీసుకున్నాడు.