English   

వార్ మూవీ రివ్యూ

War Review
2019-10-03 17:28:16

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సినిమా వస్తోందంటేనే అభిమానుల్లో ఓ రకమైన ఆసక్తి ఉంటుంది. ‘సూపర్ 30’ సినిమాతో మంచి విజయం అందుకున్న హృతిక్ రోషన్ నిన్న ‘వార్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఆయనే టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్ కిడ్ కప్పదా ఉండడం వీరిద్దరికీ యాక్షన్ హీరోలుగా మంచి గుర్తింపు ఉండడంతో సినిమా మీద మంచి అంచనాలున్నాయి. మరి ఆ సినిమా ఆ మేర అంచనాలు అందుకుందా ? లేదా అనేది చూద్దాం.

కథ :

మిలిటరీ ఆఫీసర్ కబీర్‌ (హృతిక్‌) కొన్ని కారణాల వల్ల బయటకి వచ్చేసి మిలటరీకి ఎదురు తిరిగి రెబల్‌గా మారతాడు. అతణ్ని మట్టుబెట్టడానికి మరో సైనికాధికారి ఖలీద్‌ (టైగర్‌) రంగంలోకి దిగుతాడు. ఈ ఖలీద్‌ ఎవరో కాదు గతంలో కబీర్‌ వద్దే యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్న శిష్యుడు. కానీ వ్రుత్తి ధర్మం కోసం దేశం కోసం గురువుతోనే తలపడాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు కబీర్‌ రెబల్‌గా ఎందుకు మారాడు? కబీర్‌, ఖలీద్‌ ల సమరంలో గెలిచిందెవరు అనేదే 
కథ.

కథనం :

యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ సినిమాలు అంటే ఇష్టం ఉన్నవారికి నచ్చుతుంది. గురు శిష్యులుగా హృతిక్‌‌, టైగర్‌ల నటన ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య చిత్రీకరించిన ఫైట్లు, యాక్షన్‌ సీక్వెన్స్ లు అల్టిమేట్ అనే చెప్పలి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక ట్విస్ట్‌లు ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేసి మనం సినిమా చూస్తున్నామా అక్కడే ఉన్నామా అనే భావన కలిగిస్తాయి. సెకండ్ హాఫ్ లో అసలు ట్విస్ట్ ఇదీ అని అర్దమై పోయాక అక్కణ్నుంచి సినిమా మీద ఆసక్తి తగ్గిపోతుంది. దర్శకుడు యాక్షన్‌ సన్నివేశాల మీద ఆసక్తి చూపించి కదా కధనాల మీద అంతగా దృష్టి పెట్టలేదనిపిస్తోంది.  

నటీనటులు :

 హృతిక్‌ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పోరాట సన్నివేశాల్లో హృతిక్‌, టైగర్‌ ఇద్దరూ పోటా పోటీగా టాలెంట్ చాటుకునే ప్రయత్నం చేశారు. రిస్కీ ఫైట్లను సునాయసంగా చేసేశారు. ఇక హీరోయిన్‌ పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వాణీ కపూర్‌ పాత్రను యాక్షన్‌ సన్నివేశాల మధ్య రిలీఫ్‌ కోసమే అన్నట్లుగా, గ్లామర్‌ సన్నివేశాల కోసం మాత్రమే తీసుకున్నారు. ఇక ఆమె తన పరిధి మేరకు నటించింది. అశుతోష్‌ రాణా నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యాక్షన్‌ సన్నివేశాలు అయితే హలీవుడ్‌ సినిమాలకి ఏమాత్రం తగ్గలేదు. ఆర్ఆర్-బీజీలు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఫైనల్ గా :  వార్...ఇది యాక్షన్ లవర్స్ సినిమా

రేటింగ్ : 3/5

More Related Stories