English   

అక్కడ సైరా మీద నెగ్గిన వార్...భారీగా

war
2019-10-03 19:23:46

ఒకేరోజు మూడు సినిమాలు రిలీజయ్యాయి. అందులో రెండు ఇండియన్ సినిమాలు కాగా ఒకటి హాలీవుడ్ నుండి దిగుమతి చేసుకున్నది. తెలుగు నుండి సైరా నరసింహారెడ్డి బాలీవుడ్ నుండి వార్ కాగ మరొకటి హాలీవుడ్ చిత్రం జోకర్. ఈ మూడు చిత్రాలు ఎన్నో అంచనాలతో క్రేజుతో రిలీజైనవే. ఈ మూడింటిపైనా పాజిటివ్ టాక్ వచ్చిందని ట్రేడ్ చెబుతోంది. అయితే ప్రస్తుతానికి జోకర్ సంగతి పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వచ్చిన సైరా మంచి స్పందన దక్కించుకుంది. అటు సాధారణ ప్రేక్షకుల మొదలు ఇటు క్రిటిక్స్ దాకా సైరా సినిమా మీద చిరు నటన మీద సురేందర్ రెడ్డి టేకింగ్ మీదా ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ చిరు హవా సౌత్ తోనే ఆగిపోయిందని అంటున్నారు. ఎందుకంటే నిజానికి బాలీవుడ్‌లో సైరాతో ఇద్దరు యాక్షన్ హీరోస్ వార్ ప్రకటించారు.

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లు కలిసి నటించిన వార్ కూడా నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పూర్తిగా యాక్షన్ ప్రియుల కోసం తెరకెక్కిందని, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఫ్యాన్స్‌ను థ్రిల్ కలిగించే విధంగా ఉందని బీటౌన్ టాక్. ఇద్దరు స్టార్ హీరోల సినిమా కావడంతో పాటు, భారీ బడ్జెట్ చిత్రం కావడంతో పాటుగా థియేటర్ల కేటాయింపులో కూడా సైరా కు చాలా తక్కువ కేటాయించారు. అందుకే నార్త్ ఇండియాలో సైరా పరిస్థితి దారుణంగా ఉందని, సైరా హిందీ వర్షన్ మొదటి రోజు కేవలం 2కోట్ల గ్రాస్ వసూళ్లతోనే ఆగిపోయిందని అంటున్నారు. హాలీవుడ్ మూవీ జోకర్ కంటే కూడా సైరా వసూళ్లు తక్కువ కావడం గమనార్హం. సైరా హిందీ వర్షన్ కనీసం వారాంతపు సెలవలలోనైనా పుంజుకుంటుందేమో చూడాలి మరి.

 

More Related Stories