English   

రామ్ చరణ్ ను ఏంట్రా అనేసిన తమన్నా.. షాక్ అయిన చిరు..

tam
2019-10-03 21:29:13

ఇండస్ట్రీలో హీరోలను బాబు బాబు అని పిలవడం అలవాటు. అది నిర్మాతలైనా.. హీరోయిన్ అయినా ఎవరైనా కూడా హీరోలను చాలా మర్యాదగా పిలుస్తుంటారు. కానీ తమన్నా భాటియా మాత్రం రామ్ చరణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అది కూడా చిరంజీవి స్టేజిపై ఉండగానే మెగా పవర్ స్టార్ ను ఏంట్రా అంటూ పిలిచి అందరిని ఒకసారి షాక్ అయ్యేలా చేసింది మిల్కీబ్యూటీ. సైరా థాంక్స్ మీట్ లో ఇది జరిగింది. ఈ సినిమాలో తన పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని.. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంది తమన్నా. ముఖ్యంగా దర్శకుడు సురేందర్ రెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా కూడా సరిపోదని.. తన కెరీర్లో ఒక అద్భుతమైన పాత్ర ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ చెప్పింది తమన్నా. ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా కేవలం ఒక్క నిమిషం పాత్ర ఉన్నా కూడా తనను పిలిస్తే వచ్చి చేసి వెళ్ళిపోతాను అంటుంది తమన్నా. చిరంజీవి గురించి పొగడ్తల వర్షం కురిపించింది ఈ మిల్కీ బ్యూటీ. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని.. అలాంటి నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడమే ఒక అదృష్టం అని చెప్పింది తమన్నా. ఫ్యూచర్ లో కూడా మీ సినిమాల్లో నటించాలని ఉంది అంటూ చిరంజీవిని స్టేజి పైనే అడిగేసింది ఈ మిల్కీ బ్యూటీ. ఇక చివరగా నిర్మాత రామ్ చరణ్ దగ్గరికి వచ్చింది తమన్నా. నీ గురించి నిర్మాతగా మాట్లాడాలా.. హీరోగా మాట్లాడాలా.. ఏం చెప్పాలి రా అంటూ ప్రేమగా పిలిచింది తమన్నా. అందరి ముందు రామ్ చరణ్ ను అలా రా అనేసరికి ఒక్కసారిగా షాకయ్యారంతా. అంతమంది ముందు అలా పిలిచింది అంటే రామ్ చరణ్, తమన్నా ఎంత మంచి స్నేహితులనేది అందరికీ అర్థమైపోతుంది. మొత్తానికి థాంక్స్ మీట్ లో తమన్నా చాలా అద్భుతంగా మాట్లాడింది.

More Related Stories