English   

సైరా అక్కడ తుస్.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అరాచకమే..

syeraa
2019-10-04 06:49:43

సైరా నరసింహారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దులిపేస్తుంది. తొలి రోజు ఏకంగా 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. కొన్ని ఏరియాల్లో బాహుబలి 2 రికార్డులను తిరగరాశాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎంత చేసినా కూడా అతి ముఖ్యమైన బాలీవుడ్లో మాత్రం సైరా ఆటలు ఆగడం లేదు. అక్కడ పాజిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా కలెక్షన్ల విషయంలో చాలా వెనుకబడి పోయాడు చిరంజీవి. ఈ సినిమాకు తొలి రోజు కేవలం 2 కోట్ల 80 లక్షలు మాత్రమే వచ్చాయి. 1200 పైగా స్క్రీన్లలో విడుదలైన సైరా నరసింహారెడ్డి తొలి రోజు కచ్చితంగా 5 కోట్లకు పైగా వసూలు చేస్తుందని డిస్ట్రిబ్యూటర్లు కూడా బలంగానే నమ్మారు. దానికి తోడు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కచ్చితంగా నార్త్ ఆడియన్స్ ను మెగాస్టార్ ఆకట్టుకుంటాడని.. అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వసూళ్లు బాగానే వస్తాయని అనుకున్నారంతా. కానీ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ సినిమా కూడా అక్టోబర్ 2నే విడుదల కావడంతో కలెక్షన్లన్నీ అటువైపు వెళ్లిపోయాయి.

తొలిరోజు పరిస్థితి ఎలా ఉన్నా రెండో రోజు కూడా వసూళ్లు పెద్దగా మెరుగుపడలేదని తెలుస్తోంది. దాంతో దర్శక నిర్మాతలు కంగారుపడుతున్నారు. బాలీవుడ్ లో దాదాపు 40 కోట్లకు పైగా బిజినెస్ చేసింది సైరా. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అక్కడ చిరంజీవి సినిమా నిరాశ పరచడం ఖాయంగా కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం సైరా నరసింహారెడ్డి హవా బాగానే కనిపిస్తోంది. తెలుగులో రెండో రోజు కూడా 15 కోట్లకు పైగా షేర్ వచ్చేలా కనిపిస్తుంది. ఇక్కడ సినిమా 100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఎటు చూసుకున్న కూడా చిరంజీవి ముందు భారీ లక్ష్యాలున్నాయి. మరి వాటిని ఆయన ఎంత వరకు అనుకుంటాడనేది చూడాలి.

More Related Stories